రాజకీయం రాచరికాన్ని వెలగబెడుతున్న రోజుల్లో ప్రతి నాయకుడు ఒక మంత్రిలా ఫీలవుతాడట..చాటుగా తానే రాజుగా భ్రమపడుతాడట.. ఇప్పటి రాజకీయాలు ఇలాగే ఉన్నాయి.. ఇకపోతే ఏపీలో రాజకీయాలకు ఒక గూడు లేనట్లుగా సాగుతున్నాయంటున్నారు..

 

 

ఇలా ఎందుకు జరుగుతుందో అక్కడి ప్రజలకు అర్ధం కావడం లేదు.. ఒక్కో నాయకుడు ఒక్కోరకంగా రాజకీయ రచ్చ చేస్తున్నారు. ఇది పాలనా పరంగా కానివ్వండి, మూడు రాజధానుల విషయంలో కానివ్వండి, పధకాలు అమలు విషయంలో కానివ్వండి. ఎలాగైనా ఏపీ రాజకీయాలు నిత్యం అగ్నిహోత్రంలా రగులుకుంటున్నాయి..

 

 

ఇకపోతే తాజాగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు మరోసారి ఒక అగ్గిపుల్లను వెలిగించాడు.. అందులో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేమంటే రాష్ట్రంలో మూడో పక్షం ఎదగకుండా వైసీపీ, టీడీపీల మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్లు కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

 

ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్లు చేశారు... ప్రజలను అసహానికి గురిచేస్తున్న రాజధాని అంశం రాజకీయంగా వైసీపీ, టీడీపీ బలపడటానికి దోహదం చేస్తుందని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు మూడో ప్రత్యామ్నాయానికి తావులేకుండా, ఇద్దరి నాయకుల మధ్య అవగాహనకు అనుగుణంగానే రాజధాని అంశం రాష్ట్రంలో నడుస్తోందేమో అని అనుమానం వ్యక్తం చేశారు.

 

 

ఈ విషయంలో నాయకుల తీరే అర్థం కావటం లేదని వ్యాఖ్యానించారు. ఇంకొకటి లేని విధంగా మీడియా కూడా గత 2 నెలలుగా దీన్ని ప్రధాన అంశం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కృష్ణారావు ఏది ఏమైనా మీరన్నదాంట్లో నిజం ఉంటే ఈరోజు చంద్రబాబు నడిరోడ్దులో నిలబడే వారు కాదు కదా అండీ అని కొందరు అనుకుంటున్నారట.. 

 

 

ఇదే కాకుండా ఏపీ రాజధాని అంశంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీలు విజయవంతంగా ప్రజలను విడగొట్టాయని, మూడో పక్షం బలపడకుండా రెండు పార్టీల మధ్యే పోరు ఉండేలా జాగ్రత్తపడ్డారని వ్యాఖ్యానించారు. రాజధాని విషయాన్ని కోర్టులకు వదిలిపెట్టి మరో అంశాన్ని లేవనెత్తాలని బీజేపీ అధిష్టానికి ఆయన సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: