బీజేపీ పార్టీ నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీల మధ్య రహస్య ఒప్పందం అని చెప్పారు. వైసీపీ, టీడీపీ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పార్టీ ఎదగకుండా రహస్య ఒప్పందం చేసుకున్నాయని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. 
 
నిన్న ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ ఖాతా నుండి ఈ మేరకు ట్వీట్లు చేశారు. వైసీపీ, తెలుగుదేశం పార్టీలు రాష్ట్రంలో బలపడటానికి రాజధాని అంశం సహాయపడుతోందని అన్నారు. చంద్రబాబు, జగన్ మధ్య అవగాహనకు అనుగుణంగానే రాష్ట్రంలో రాజధాని అంశం నడుస్తోందని, జగన్ చంద్రబాబు రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నారని అన్నారు. గత రెండు నెలలలుగా మీడియా రాజధానినే ప్రధాన అంశంగా చేసుకొని మిగతా అంశాలను పట్టించుకోవటం లేదని అన్నారు. 
 
వైసీపీ, టీడీపీ పార్టీలు రాజధాని విషయంలో ప్రజలను విజయవంతంగా విడగొట్టాయని కామెంట్లు చేశారు. వైసీపీ, టీడీపీ పార్టీల మధ్యే పోరు ఉండే విధంగా జాగ్రత్త పడ్డారని రాష్ట్రంలో మూడో పక్షం బలపడకుండా ఈ రెండు పార్టీలు చేస్తున్నాయని అన్నారు. బీజేపీ అధిష్టానానికి రాజధాని విషయాన్ని కోర్టులకే వదిలిపెట్టేలా చేయాలని సూచిస్తున్నానని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు.
 
కొన్ని నెలల క్రితం బీజేపీలో చేరిన ఐవైఆర్ కృష్ణారావు వైసీపీ ప్రభుత్వంపై కొన్ని రోజుల క్రితం ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలాగానే వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని అన్నారు. జగన్ కు తెలియకుండా రాష్ట్రంలో ఏవైనా ఘటనలు జరిగి ఉంటే త్వరితగతిన నష్ట నివారణ చర్యలను తీసుకోవాలని ఐవైఆర్ కృష్ణారావు సూచించారు. ఇమామ్లకు, పాస్టర్లకు ఆర్థిక సహాయం చేసే విధంగా మేనిఫెస్టోలో పేర్కొనటం రాజ్యాంగ విరుద్ధమని ఐవైర్ కృష్ణారావు చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: