మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్ ను నిర్ణయిస్తాయి. కానీ ఒక్కోసారి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో.. ఉన్న దారుల్లో దేన్ని అనుసరించాలో ఒక పట్టాన అర్థం కాదు. ఎంపికలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. అలాంటి సమయంలో మనకు సరైన సలహా ఇచ్చేవారు ఒకరుండాలి.

 

ఆ ఒక్కరికి మనపై పూర్తి అవగాహన ఉండాలి. మనకు ఏది మంచి ఏది చెడు అనేక అవగాహన మనకన్నా ఎక్కువగా ఆ సలహా ఇచ్చే వారికి ఉండాలి. అలాంటి వ్యక్తిని మనం జీవితంలో ఒక్కరినైనా సంపాదించుకోవాలి. ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే.. అర్జునుడికి కృష్ణుడిలా ఉండాలి.

 

ఎందుకంటే.. భారతంలో కృష్ణుడి సాయం కోసం దుర్యోధనుడు,అర్జునుడు వస్తారు. అర్జునుడు సైన్యం కంటే.. నాకు కృష్ణుడు ఒక్కడు ఉంటే చాలు అని కోరుకుంటాడు. అదేమిటి ని కృష్ణుడు అర్జునుడిని అడిగితే ఏమన్నాడో తెలుసా.. ‘బావా మహానుభావా! నీ సైన్యంతో నాకు పనిలేదు. నువ్వొక్కడివే నా పక్కన ఉంటే చాలు’ అంటాడు.

 

శ్రీకృష్ణుడు అర్జునుడితో నేను యుద్ధం చేయను అని చెప్పానుగదా! మరి నన్ను ఎందుకు కోరుకున్నావు?’ అని అడిగితే.. ‘నువ్వు ఒక్కడివే వారినందర్నీ వధింపగలవు. నువ్వు నా రథసారథిగా ఉండు. అంతేచాలు!’ అని అర్జునుడు శ్రీకృష్ణుడికి నమస్కరించాడు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడే విజయమూ ఉంటుంది. విజయసారథి అండగా ఉంటే విజయులవుతారు! నిజ జీవితంలోనూ అంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: