చీర మగువకు అందాన్ని ఆపాదించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆడపిల్లకు నిండుదనం, నిండైన చీరతో వస్తుంది. చూడగానే ముచ్చటగా కనిపించే చీరకట్టులోని మహిమ అంతా ఇంతా కాదు.. ఒక ఆడపిల్ల జీవితంలో చీరకున్న ప్రాధాన్యత విశేషమైనది.... ఎన్నో శుభకార్యాల్లో ముత్తైదువులా ముందుండి నడిపించే చీర కధ చాలా పెద్దది. ఇలాంటి చీర ఓ కొత్త జీవితాన్ని ఆదిలోనే తుంచేసింది..

 

 

ఒక జంటను విడదీసింది.. నిజమండి బాబు. ఇక్కడ చీరే విలన్‌గా మారి, పచ్చని పందిరిని, రచ్చ రచ్చ చేసింది. పెళ్లి పెటాకులు చేసింది. ఈ వివరాలు తెలుసుకుంటే.. ప్రేమించినంత కాలం భగ్న ప్రేమికుల్లా ప్రవర్తించారు. ఇక వారి ప్రేమకు పులిస్టాప్ పెట్టి ఓ ఇంటివారు అవుదామని నిర్ణయించుకున్నారు. అక్కడి వరకు వారి ప్రయాణం సాఫీగానే సాగింది. ఆ నిర్ణయం పెళ్లి వరకు వెళ్లింది. ఇక కొన్ని గంటల్లో వారిద్దరు వైవాహిక జీవితంలో అడుగుపెట్టి, దంపతులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయంలో విలన్‌లా చీర టాపిక్ ముందుకు వచ్చింది.

 

 

బీదర్ కేర్ కు చెందిన బీఎన్ రఘుకుమార్ అదే గ్రామానికి చెందిన సంగీత ప్రేమించుకున్నారు.. పెళ్లికి ముహూర్తం ఫిబ్రవరి 7గా నిర్ణయించారు. పెళ్లి బట్టలు కొన్నారు.. అయితే వధువు చీర బాగోలేదని.. నాసిరకంగా ఉందని పెళ్లికొడుకు రఘుకుమార్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ చీర వద్దు.. మరో చీర అయితే బాగుంటుందని తెలపడంతో వధువు వినలేదు. లేదు నాకు ఈ చీరే నచ్చిందని ఇదే ధరిస్తానని చెప్పడంతో వరుడి కుటుంబ సభ్యులకు కోపమొచ్చింది.

 

 

ఇలా ఈ గొడవ తుఫానులా మారి చివరకు పెళ్లి ఆగేలా చేసింది. దీంతో ఎవరికీ తెలియకుండా వరుడు రఘుకుమార్ పారిపోయాడు. ఇక ఈ విషయం పోలీసు స్టేషన్ గడప తొక్కింది.. ఇన్నాళ్లూ చీరతో ప్రాణాలు తీసుకోవడం తెలుసు గాని, ఇప్పుడు ఇలా జంటలను కూడా ఈ చీర విడదీస్తుందని ఇప్పుడే నిరూపించింది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: