వీకెండ్ వ‌స్తుందంటే చాలు సిటీల్లో ఉండేవారికి అదొక పండ‌గ అయిపోయింది. వారం అంతా క‌ష్ట‌ప‌డి ఆ వారంలో వ‌చ్చే ఒక్క‌రోజు కోసం ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తారు. అందులోనూ సాఫ్ట్‌వేర్ జాబ్ అయితే మ‌రీనూ పైగా వారికి శ‌ని, ఆది రెండు రోజులు సెల‌వ‌లు రావ‌డంతో మ‌రింత ఉత్సాహంగా దాని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక గూగుల్ ఎంప్లాయిస్ అయితే ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వాళ్ళ‌కి వారానికి 3 రోజులు సెల‌వ‌లు అంటే, శుక్ర‌, శ‌ని, ఆది మూడు రోజులు కాక‌పోతే మిగ‌తా రోజులు వారికి వ‌ర్కింగ్అవ‌ర్స్ కాస్త ఎక్కువ‌గా ఉంటాయి. ఇంక పెళ్ళైన భార్యాభ‌ర్త‌లైతే వీకెండ్ కోసం తెగ ఎదురు చూసేస్తుంటారు. ఎందుకంటే ఉరుకుల ప‌రుగుల జీవితంలో ఇద్ద‌రు ఉద్యోగ‌స్తులైతే వారికి ఇంట్లో తెచ్చుకునే క‌నీస అవ‌స‌రాల‌కు కూడా స‌మ‌యం దొర‌క‌దు. దాంతో వారు ఎప్పుడెప్పుడు వీకెండ్ వ‌స్తుందా అని ఎదురు చూస్తుంటారు.

 

బెట‌ర్ హాఫ్‌తో క‌లిసి షాపింగ్‌కు ప్లాన్ చేసుకునేందుకు శ‌నివారం అత్యుత్త‌మం. పిల్లలు ఎలాగూ స్కూళ్ల‌కు వెళ్లిపోతారు కాబ‌ట్టి ఆ స‌మ‌యంలో ఇరువురూ ఏకాంతంగా ఎంజాయ్ చేసేందుకు కూడా మంచి ఛాన్స్ ల‌భిస్తుంది. అంతేకాక ఇంట్లో మ‌న‌కు ఏవైనా ప్రొవిజ‌న్స్ అవి కావాలంటే కూడా శ‌నివారం తెచ్చేసుకోవ‌చ్చు. ఆదివారం అంటే పిల్ల‌లు ఇంట్లో ఉంటారు. వాళ్ళ‌తో క‌లిసి షాపింగ్‌కి వెళితే ఏవో డ్ర‌సెస్ ఇంకా మ‌రేమ‌న్నా కిడ్స్ ఎంజాయ్ చేసేవి తినేవి కొంటే ఓకే  అలాకాకుండా మ‌నం ఇంట్లో కావ‌ల‌సిన ప్రొవిజ‌న్స్ కొనుక్కుంటూ ఉంటే వారు చాలా బోర్ ఫీల‌వుతారు. అంతేకాక కొంత మంది పిల్ల‌లైతే మేం రాము మీరు వెళ్ళండి అంటూ ఇంట్లోనే టీవీల‌కు అతుక్కుపోతుంటారు.  ఇక కూర‌గాయ‌ల విష‌యానికి వ‌స్తే అవి కూడా శ‌నివారం సాయంత్రం తెచ్చుకోవ‌డం బెట‌ర్. ఆరోజే తెచ్చేసుకుంటే ఆదివారం మ‌న‌కు కాస్త స‌మ‌యం దొరుకుతుంది. పిల్ల‌ల‌తో క‌లిసి మ‌నం ఎక్క‌డికైనా వెళ్ళ‌డానికి వారితో క‌లిసి ఎంజాయ్ చెయ్య‌డానికి కొంత స‌మ‌యం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: