సండే అన‌గానే సాధార‌ణంగా ఉద్యోగులు ఉద‌యాన్నే నిద్ర లేచేందుకు బ‌ద్ద‌కిస్తూ ఉంటారు. కానీ, ఉద‌యాన్నే సాధార‌ణ రోజుల్లో నిద్ర‌లేచే విధంగానే లేచి.. ఫ్యామిలీలో ఉన్న వారంద‌ర్నీ లేపి..  ఫ్ర‌ష్ అయి.. ఎవ‌రి అభిరుచిని బ‌ట్టి వారు రెస్టారెంట్‌కు వెళ్లి టిఫెన్ చేయ‌డంతో ప్రారంభ‌మ‌య్యే సండే నిజంగా ఆ వారం మొత్తానికి ఫ్యామిలీకి మంచి బూస్ట‌ప్ ఇస్తుంద‌న‌డంలో సందేహం లేదు. రోజు ఉరుకుల ప‌రుగుల జీవితంలో ఒక్కోసారి మ‌న‌కు టైం స‌రిపోక తిన‌డానికి కూడా ఉద‌యం పూట స‌మ‌యాన్ని కేటాయించ‌లేము. దాంతో టిఫిన్ అంటే సింపుల్‌గా ఏ పాలు బ్ర‌డ్ లేదంటే కార్న్‌ఫ్లాక్స్ ఇలాంటి సింపుల్ టిఫిన్ చేసేసి ఆఫీస‌ల‌కి బ‌య‌లుదేరిపోతుంటారు. మ‌రి మ‌న‌కు స‌మ‌యం దొరికేది ఒక్క ఆదివారం కాబ‌ట్టి ఆరోజు అంద‌రూ కాస్త లేటుగా లేస్తారు. అందులో ఇంట్లో వండేవాళ్ళు మ‌రింత లేటుగా లేస్తారు. ఎందుకంటే రోజంతా ప‌నులు చేస్తూ బిజీగా ఉన్న‌ప్పుడు అబ్బ రేపు ఆదివారం కదా కాస్త ఎక్కువ సేపు ప‌డుకోవ‌చ్చు అని శ‌నివారం రోజునే ఫిక్స్ అయి ఉంటారు. 

 

దాంతో ఆదివారం కాస్త లేట్ లేచి చ‌క్క‌గా మ‌న‌కు న‌చ్చిన రెస్టారెంట్‌కి వెళ్ళి అక్క‌డ మ‌న‌కు ఏం కావాలంటే అది ఆర్డ‌ర్ ఇచ్చి తినొచ్చు. అలా తింటూ ఫుల్ ఎంజాయ్ చేస్తే చాలు మ‌ళ్ళీ వారం అంతా అదే పెద్ద బూస్ట‌ప్‌గా ఉంటుంది. అందులోనూ అంద‌రూ క‌లిసి కూర్చుని క‌బుర్లు చెప్పుకుంటూ తినే టైం ఒక్క‌సండే మాత్ర‌మే ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఆఫీస్‌లు, స్కూల్స్ ఇలా ఎవ‌రి బిజీతో వారు ఉంటారు. ఎవ‌రికి అయితే వారు ముందుగా ఏదో ఒక‌టి తినేసి వెళ్ళిపోతుంటారు. మ‌రి ఆదివారం వ‌స్తే అలా కాదు. ముందురోజు నైట్ ప్లాన్ చేసుకుంటారు. అందులోనూ చిన్న పిల్ల‌లు ఉంటే మ‌రీనూ పిల్ల‌లు ముందురోజే రేజే రేపు రెస్టారెంట్‌లో నేను అది ఆర్డ‌ర్ చేస్తా ఇది ఆర్డ‌ర్ చేస్తా అంటూ ఫుల్‌గా ముందుగానే ఛార్ట్‌ని ప్రిపేర్ చేసేసుకుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: