మేడారం జాతర ముగిసింది. దాదాపు 15 రోజులుగా మేడారం జన సంద్రమైంది. భక్తుల రాకతో కిక్కిరిసిపోయింది. రోజూ లక్షల్లో భక్తులు మేడారం జాతరకు వచ్చారు. మరి తెలుగు రాష్ట్రాల్లో అంత పెద్ద గిరిజన జాతర జరిగితే.. కోట్ల సంఖ్యలో భక్తులు తరలివస్తే.. ఆంధ్రా మీడియా, నాయకులు మాత్రం ఈ విషయానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదన్న విమర్శలు, వాదనలు వినిపిస్తున్నాయి.

 

 

మేడారం జాతరకు కమ్మ ప్రముఖలుు ఎవరూ హాజరు కాలేదు. అయితే దీనిపై ఓ విచిత్రమైన వాదన వినిపిస్తోంది. అదేంటంటే.. ‘కాకతీయులు అంటే తమవాళ్లనేది కమ్మ సామాజిక వర్గం భావన. కమ్మ వారి కుల సంఘాల సమావేశాల్లోనూ, ఫ్లెక్సీల్లోనూ, సోషల్ మీడియాలోనూ కమ్మవారు రుద్రమ దేవిని తమ నాయకురాలిగా చెప్పుకుంటారు. అయితే మేడారం జాతరకూ దానికీ లింక్ ఏంటనుకుంటున్నారా..?

 

 

సమ్మక్క-సారలమ్మలు కాకతీయ రాజులను ధిక్కరించి, వాళ్లపై పోరాడారు. కాకతీయులు కమ్మవాళ్లు కాబట్టి.. వారిపై పోరాడిన సమ్మక్క సారక్కలనుకూడా కమ్మవ్యతిరేకులుగా పరిగణనలోకి తీసుకుని ఈ వివక్ష చూపిస్తున్నారనేది ఒక వాదన. మరి ఈ వాదనలో ఎంత వరకూ వాస్తవం ఉందో తెలియదు కానీ.. కమ్మ ప్రముఖులు ఎవరకూ ఈ మేడారం జాతరకు హాజరుకాకపోవడం విశేషం.

 

 

అన్ని పత్రికలనూ పరిశీలించినా.. అన్ని టీవీలనూ చూసినా ఈ విషయం అర్థమవుతుంది. కమ్మ నాయకులు, ప్రముఖులే కాదు.. కమ్మ ఆధిపత్యంలోని మీడియా కూడా ఈ జాతరను విస్మరించిందన్న వాదన ఉంది. అయితే ఇందులో లోప‌ల మాత్రం క‌మ్మ ప‌త్రిక‌లే కాకుండా... సాక్షి లాంటివి కూడా స‌రిగా ఫోక‌స్ చేయ‌లేద‌ు. ఇక మేడారం విషయానికి వస్తే.. రెండేళ్లకోసారి జరిగే గిరిజన కుంభమేళాగా చెప్పుకోవచ్చు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒరిస్సా, మహారాష్ట్రల నుంచి లక్షల మంది ఈ జాతరకు వచ్చారు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా మేడారం గురించి చెప్పుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: