చాలామంది అధ్యాత్మికత అంటే నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించి పూలమాలతో జపమాలలో ఉండటం అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమైన అధ్యాత్మికత అంటే మిమ్మల్ని మీరు గుర్తిస్తూ మీలోని సారాన్ని మీరు తెలుసుకోవడం. అధ్యాత్మికత అంటే విజ్ఞానం కాదు జీవన సారం. అధ్యాత్మికత చింతనను అలవరచుకోవడం ద్వారా ఆత్మ పరిశుద్ధి కలిగి అన్నీ శుభాలు చేకూరుతాయి. 
 
ఈ పదాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉపయోగిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే నేను అనేది ఎవరో తెలుసుకోవడమే అధ్యాత్మికత. అధ్యాత్మికతతో కూడిన అన్వేషణలో తెలియనిదానినుండి తెలిసిన దానిని విడదీసి తెలిసినదానితోనే అన్వేషణ చేయడానికి చేసే ప్రయత్నం. ఈ విధంగా అధ్యాత్మికతతో కలిగే జ్ఞానం వలన మన జీవితంలో మార్పులు వచ్చి మనం జీవితంతో సమాధానపడగలం. 
 
ప్రతి వారంలో కొంత సమయం పాటు అధ్యాత్మిక అంశాలకు కేటాయించటం వలన మనకు తెలియకుండానే మనలో గొప్ప మార్పులు వస్తాయి. నేటి యువతకు వివిధ మార్గాలలో ఆనందం, సంతోషం పొందడం ఎంత ముఖ్యమో అధ్యాత్మికత కూడా అంతే ముఖ్యం. వీకెండ్ లో కొంత సమయం కుటుంబంతో కలిసి ఆలయాలను సందర్శించటం, అధ్యాత్మిక చింతనను పెంచుకోవటం చేస్తే రాబోయే కాలం అంతా మంచే జరగబోతుందని ఆశావహ దృక్పథం అలవడుతుంది. 
 
అధ్యాత్మిక చింతనలో భాగంగా దైవ ధ్యానం చేయటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. అధ్యాత్మిక చింతన వలన ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అందువలన ప్రతి శనివారం, ఆదివారం వీలైతే కుటుంబ సభ్యులతో సహా గుళ్లను సందర్శించి అధ్యాత్మికతను అలవరచుకోవడం మంచిది. అధ్యాత్మికతలో భాగంగా ఇష్టదైవ నామస్మరణ చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. వారంలో కొంత సమయం ఆలయ దర్శనానికి ప్రాధాన్యతను ఇవ్వాలి.                             

మరింత సమాచారం తెలుసుకోండి: