ఏపీ నుంచి కియా మోటార్స్ సంస్థ తరలిపోతోందంటూ రెండు, మూడు రోజులుగా జోరుగా ప్రచారం సాగింది. కాస్తో కూస్తో పేరున్న రాయిటర్స్ వార్తా సంస్థ నుంచి ఈ కథనం రావడం కలకలం సృష్టించింది. రాయిటర్స్ కథనం ఆధారంగా పలు వార్తా పత్రికలు ఈ కథనం గురించి ప్రచారం చేశాయి. దీంతో ఈ విషయాన్ని ఏపీ సర్కారు కూడా సీరియస్ గా తీసుకుంది.

 

అయితే కియా సంస్థ తరలింపు వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్వయంగా ఆ సంస్థ ఎండీయే మీడియా ముందుకు వచ్చి మరీ వివరణ ఇచ్చారు. కాబట్టి అది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో దిమ్మతిరిగే న్యూస్ వచ్చింది. కియా విషయంలో దుష్ప్రచారం జరిగిపోయిన తర్వాత... సదరు రాయిటర్స్ సంస్థ తాపీగా స్పందించింది.

 

ఈ కథనం పొరపాటున రాశామని.. అది అసత్యకథనమని.. అందుకే దాన్ని తొలగిస్తున్నామని ప్రకటించింది. మరి రాయిటర్స్ వంటి సంస్థ అలా అడ్డగోలుగా ఎలా కథనం రాస్తుంది. మళ్లీ అంత సులభంగా ఎలా సారీ చేప్పేసిందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. టీడీపీ లాబీయింగ్ ఫలితంగానే ఈ కథనం వచ్చిందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీ సర్కారు కూడా సీరియస్ గా నే ఉంది. మరి ఈ రాయిటర్స్ వివరణపై వారు ఎలా స్పందిస్తారో.. ?

మరింత సమాచారం తెలుసుకోండి: