నిత్యమూ జీవిత‌ము నీటిపైబుగ్గ‌!- అంటారు తాత్వికులు. ఉన్న ఈ చిన్న కాలంలోనే మ‌నం సంతోష ప‌డుతూ.. ఫ్యామిలీని సైతం సంతోష‌ప‌రిచేలా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకోవ‌డం చాలా ముఖ్యం. మన శ్రమంతా కుటుంబం కోసమే అయినప్పుడు ఆ కుటుంబానికి సమయం కేటాయించకపోతే ఎలా. అందుకే వీకెండ్‌ను కేవలం ఫ్యామిలీ కోసం అన్నట్టుగా ప్లాన్‌ చేసుకోవాలి. ఇంట్లోని ప్రతీ సభ్యుడు మళ్లీ వీకెండ్‌ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా ఉండాలి సెలబ్రేషన్‌.


వారమంత మీకు మీ ఉద్యోగానికి ఫ్రెండ్స్‌ ఇంకా ఇతర విషయాలకు, మీ కుటుంబం కోసం అంటు ఉండేది కేవలం వీకెండ్‌ మాత్రమే. అందుకే వీకెండ్‌ను కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. అందుకోసం పెద్దగా శ్రమ పడాల్సి పని కూడాలేదు. వాళ్లకు నచ్చిన విధంగా ఉంటే చాలు. సాధారణంగా వారమంత వాళ్లు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ ఒక్కరోజు సరదాగా బయటకు తీసుకెళ్లండి. పార్కుకో, సినిమాకో, గుడికో మరేదైన ప్రదేశానికో తీసుకెళ్లండి.


ఇక పిల్లలు కూడా వారమంత చదువు ఒత్తిడిలో ఉంటారు కాబట్టి వాళ్లకు సరదాగా అనిపించే, ఆహ్లాదం కలిగించే ప్రాంతాలకు తీసుకెళ్లేలా ప్లాన్‌ చేసుకోండి. వారమంత వంటిట్లోనే గడిపే మీ సహచరికి ఈ ఒక్కరోజు సెలవు ఇవ్వండి. కుటుంబంతో కలిసి ఏ రెస్టారెంట్‌కో వెళ్లి లంచ్‌, డిన్నర్‌ చేయండి. అలా చేస్తే వారమంత మీరు కుటుంబానికి దూరంగా ఉన్నార్న విషయాన్నే మీ ఫ్యామిలీ అంతా మర్చిపోతారు.


వీకెండ్ రోజు ఎక్కువ సమయం కుటుంబంతోనే గడిపేలా చూసుకోండి. ఇంట్లోని ప్రతీ ఒక్క సభ్యుడితో ప్రత్యేకంగా మాట్లాడండి, వారంలో వారు ఏం చేశారు, మంచి చెడు ఇలా అన్ని విషయాలు చర్చించండి. అప్పుడు వారం అంతా మీరు బిజీలో ఉన్నారన్న విషయాన్ని కూడా వారు మర్చిపోతారు. ఫైనల్‌గా వారం అంతా ఎలాంటి ఒత్తిడిలో ఉన్నా ఈ ఒక్కరోజు మాత్రం మీ సమయమంతా కుటుంబానికే కేటాయించి, మళ్లీ వీకెండ్ ఎప్పుడొస్తుందా అని వారంతా ఎదురుచూసేలా చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: