ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పుత్రరత్నం చేసిన నిర్వాహకానికి ప్రతిఫలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంట బయట ప్రతి ఒక్కరు కష్టాలు పాలయ్యారు. ఇది నూటికి నూరు శాతం నిజమని నెటిజనులు తెగేసి చెపుతున్నారు. తెల్లారేపటికి కోట్లు గడించాలన్న స్వార్ధ బుద్ధితో చేసిన బుద్ధిలేని పనికి ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలే ప్రభల సాక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్ళితే.. అసలు విజన్ పాలనలో జరిగిన చిత్రాలు స్పష్టమవుతాయి కూడా.  నందమూరి నాటకిశోరం బాలయ్య బాబు చిన్నల్లుడికి ఇంకా కష్టాలు తీరినట్టు లేదు.

అమరావతి దగ్గరలో అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన వందల ఎకరాల భూముల్నిముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడేమో సదరు 'గీతం భరత్' రూ.125 కోట్లు కట్టాల్సిందేనంటూ కరూర్ వైశ్యా బ్యాంక్ నోటీసు ఇవ్వడం ఏమిటి పత్రికల్లో…? గతంలో ఆంధ్రా బ్యాంకు కూడా వంద కోట్లు కట్టు అంటూ ఒత్తిడి. ఇప్పుడేమో బాకీ కట్టకపోతే వైజాగ్ సరిహద్దుల్లోని భూములు అమ్మి మరీ జమ చేసుకుంటానని బ్యాంకు బెదిరింపులు ఏమిటి అసలు..? అసలు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నది తిరిగి కట్టడానికా ఏం..? ఒకేసారి ఏమైంది బ్యాంకర్లకు..? తిరిగి కట్టమని దబాయించి అడుగుతున్నారు ఏమిటి..? భయం లేకుండా పోయింది. 

జేసీ..దివాకరా..! ఇదేం ఫోర్జరీ తలనొప్పి:
ప్యూర్ రెడ్లు అయిన జేసీ బ్రదర్స్ ఆఫ్టరాల్ తాడిపత్రి ఎస్ఐ సంతకం ఫోర్జరీ చేయించి, లారీలు అమ్మిన కేసులో దొరికిపోవడం ఏమిటి..? మొన్నమొన్ననే కదూ త్రిశూల్ సిమెంటు ఫ్యాక్టరీకి అప్పట్లో ఇచ్చిన 1600 ఎకరాల్ని జగన్ లాగేసుకున్నది. చంద్రబాబు 'కడుపులో తలపెట్టి' జేసీ పెద్ద బ్రదరుడు బావురుమన్నది అప్పుడేనా..? ఆ బస్సులపై ఎన్ని కేసులు పెడుతున్నారో ఇంకా తేలడం లేదు. ఆయన సంగతి ఈ బాబే చూసుకోవాలి. స్థూలంగా పైపైన చూస్తే ప్రస్తుతం సాగుతున్న సోదాలు ఒక జీఎస్టీ ఎగవేత, ఒక ఐటీ పన్ను ఎగవేత కోణాల్లో మాత్రమే సాగడం లేదని అర్థమవుతూనే ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: