పంజాబ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా పేలుడు భారీ పదుల  సంఖ్యలో ప్రాణాలు బలిగొంది. భారీ పేలుడుతో ఒక్కసారిగా ప్రజలందరూ ప్రాణ భయంతో పరుగులు తీశారు. తాన్ తరన్  జిల్లాలో సంకీర్తనల  సమయంలో బాణాసంచా పేలుడు సంభవించింది. పేలుడు భారీగా సంభవించడంతో సుమారు ఈ ఘోర ప్రమాదంలో 15 మంది చనిపోయినట్లు ప్రాథమికంగా సమాచారం. ప్రమాదవశాత్తు బాణసంచా పేలడంతోనే  ఈ ప్రమాదం జరిగిందని ఏఎస్పీ ధృవ్  దహియా స్పష్టం చేశారు. ఈ ఘటనతో ప్రజలందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు. కాగా ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. సుమారు ఈ భారీ పేలుడు సంఘటనలో 14 నుంచి 15 మంది చనిపోయి ఉంటారని సమాచారం. 

 

 

 కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారు ఎక్కువగా 18 నుంచి 19 సంవత్సరాల మధ్యలోనీ వయస్సు  వారే అని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.తాన్ తరన్  జిల్లా లోని పాహు గ్రామంలో భక్తులు నగర కీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా  ఈ కార్యక్రమం కోసం భారీ ఎత్తున ట్రాక్టర్ ట్రాలీ లో అక్కడికి బాణసంచాను తీసుకొచ్చారు. ఓ వైపు భజన జరుగుతున్న సమయంలోనే ట్రాక్టర్ ట్రాలీ లోని  బాణసంచా పేలింది. అయితే ఈ బాణాసంచా  ఎలా పేలింది అన్నదానిపై ప్రస్తుతం అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎవరైనా కావాలని బాణసంచా పేల్చారా...  లేక ప్రమాదవశాత్తు పేలినదా  అనే దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

 


 ట్రాక్టర్ ట్రాలీలో  భారీ ఎత్తున బాణసంచా నిల్వ ఉండటంతో ఫొటాషియం ఓకే చోట నిల్వ  ఉన్నట్లయ్యింది . దీంతో పేలుడు  ప్రభావం మరింత ఎక్కువగా జరిగింది. అయితే ఈ ప్రమాదంలో 14 మంది నుంచి 15 మంది మరణించడమే కాదు.. మరో ముగ్గురు కూడా తీవ్రంగా  గాయపడినట్లు తెలిసింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు పోలీసులు.కాగా  ఈ ఘటనతో స్థానిక ప్రజలు అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భజన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరూ... ప్రాణ భయంతో పరుగులు తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: