ఈ వాహనదారులకు కొద్దిగా కూడా బుద్ధి లేకుండా పోయింది.. కాసేపు కూడా ఆగలేకపోతున్నారు. అందరూ కాదు లెండి.. కొందరు వాహనదారులు మాత్రమే ఆలా ఉన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ పడిన ఒక్క నిమిషం ఆగలేరు.. ఏవో కొంపలు మునిగిపోయినట్టు చేస్తారు. పక్కన ప్రాణాలు పోతున్నాయి అన్న కూడా అంబులెన్సు కు దారి ఇవ్వరు. 

 

అంత బిజీ వాళ్ళు.. క్షణమైనా ఓపిక పట్టారు.. బండి ఎంత స్పీడ్ నడుస్తే అంత స్పీడ్ నడుపుతారు. యమ స్పీడ్ అంటే యముడి దగ్గరకు వెళ్లేంత స్పీడ్ నడుపుతారు. ఇప్పుడు ఇవి అన్ని ఎందుకు చెప్తున్నా అంటే.. ఓ వ్యక్తి చేసిన పని గురించి చెప్తున్నా.. అసలు ఏం జరిగింది అంటే.. ఓ ప్రాంతంలో అధికారులు కాసేపటి వరకు రోడ్డుపై రాకపోకలను ఆపివేశారు.

 

ఏనుగులు రోడ్డు దాటుతున్నందుకు వాళ్లు ఈ చర్యలు చేపట్టారు. అయితే అవి దాటేంతవరకు ఆగలేని ఓ వాహనదారుడు నిర్లక్ష్యంగా తన బండిని ముందుకు పోనిచ్చాడు. సరిగ్గా అదే సమయానికి ఓ గున్న ఏనుగు రోడ్డు దాటేందుకు వచ్చింది. అయితే తృటిలో దాని నుండి తప్పించుకుని బండిని ముందుకు పోనిచ్చి ప్రాణాలను కాపాడుకున్నాడు. కానీ.. లేకుంటే అతని శవం శ్మశానంలోకి.. ప్రాణం గాల్లోకి పోయేవి. 

 

అంత పని ఏముంది చెప్పండి ? కొంచం ఆలస్యం అయితే ప్రాణాలు పోయేవి.. ఆ మాత్రం బుద్ధి ఉండక్కర్లే ? ప్రాణం కంటే ముఖ్యమా? ఆ పని? ఛీ.. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది.. మనుషులు ఎంత ప్రమాదకరమైన వారు అని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పర్వీన్‌ కస్వాన్‌ అనే అటవీ శాఖ అధికారి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

 

సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ అధికారి.. ''ఏనుగులు రోడ్డు దాటడం కోసం ఆ రహదారిలో వాహనాలను కాసేపటి వరకు నిషేధించాం. దీనికి వాహనదారులు కూడా సహకరించారు. కానీ అతను మాత్రం అవేవీ పట్టించుకోకుండా ప్రాణాలను రిస్క్‌లో పెట్టాడు. సెకన్‌ ఆలస్యమైనా అతని పని అయిపోయేదే. దయచేసి ఇలాంటివి ఇంకెప్పుడూ చేయకండి'' అని పేర్కొన్నాడు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: