వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని గురించి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రచ్చకు తెరలేపుతున్నాయి. రాజధాని తరలింపు ఇప్పటికే ప్రారంభమైందని బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు విపక్షాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పలు శాఖల తరలింపు, సచివాలయం తరలింపు ఇప్పటికే మొదలైందని వ్యాఖ్యలు చేశారు. 
 
తెలుగుదేశం పార్టీ వర్గాలు మాత్రం శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లు తిరస్కరణకు గురైందని బిల్లు తిరస్కరణకు గురైనా రాజధాని విషయంలో ముందుకు వెళ్లటం ఏమిటని అన్నారు. బొత్స సత్యనారాయణ రాజధాని తరలింపు ప్రక్రియ ఇప్పటికే మొదలైందని వ్యాఖ్యలు చేయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. టీడీపీ నేతలు బొత్స సత్యనారాయణ బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నారని శాసన మండలి తిరస్కరించిన అంశాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 
 
వైసీపీ పార్టీ నేతలు మాత్రం రాజధాని తరలింపు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయని రాజధాని తరలింపును ఎవరూ ఆపలేరని చెబుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును తిరస్కరించిన శాసన మండలినే రద్దు చేయడంతో ప్రభుత్వం రాజధానుల తరలింపు విషయంలో ముందడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చంటూ సీఎం జగన్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 
 
ఆ తరువాత జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు కూడా మూడు రాజధానులకు అనుకూలంగా నివేదిక ఇవ్వడం మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో కూడా ఆమోదం పొందడం తెలిసిందే. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం పేరుతో కొన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలించింది. శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపిన సీఎం జగన్ ఆ రద్దు తీర్మానం ఆమోదం పొందక ముందే మూడు రాజధానుల దిశగా అడుగులు వేయడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: