తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే కొనసాగుతూ ఉంటాయన్న విషయం. ప్రతిపక్షాల విమర్శలు అధికార పార్టీ నేతల కౌంటర్ లతో తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే సాగుతుంటాయి. మరి ఈ వారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా  సాగిన అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఈ వారమే  కాదు గత కొన్ని వారాలుగా తెలంగాణ రాజకీయాల్లో  హాట్ గా మారిన అంశం కేటీఆర్కు సీఎం పదవి. కేటీఆర్ త్వరలో సీఎం పదవిని అలంకరించనున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ వారసుడు కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్ట పోతున్నారు అంటూ గత కొన్ని వార్తలు వస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఈ వారం కూడా ఇవే వార్తలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. 

 

 అయితే కేటిఆర్ కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం తో పాటు తన కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా కీలక పదవి కట్టబెట్టిదుకు కెసిఆర్ ఆలోచిస్తున్నట్లు గత వారం రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎంపీగా ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో అంతగా తెరమీద కనిపించేది కవితకు... ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కట్టబెట్టి తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడని గత వారం రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక అంతే కాకుండా కెసిఆర్ కూతురు కవిత ఎంపీ గా పోటీ చేయాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి గా మారబోతుంది అనే అంశం గత వారం రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

 


 అంతేకాకుండా త్వరలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవి మార్చ పోతున్నారని దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిసిసి చీఫ్గా తొలగించి ఆ స్థానంలో ఎవరికీ ఆ పదవిని కేటాయించ బోతున్నారు అనేది కూడా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎన్నో రోజుల నుంచి ఆశతో ఉన్న మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ కి పీసీసీ పదవి ఇస్తారా లేక ఎప్పటినుంచో పార్టీలో కొనసాగుతున్న పార్టీ సీనియర్ నేతల్లో  ఒక్కరైనా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి ఈ పదవిని కట్టబెడతారా  అనేది కూడా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: