ఈ మ‌ధ్య క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. రోజు రోజుకి ఆడ‌వారి పై జ‌రిగే ఆఘాయిత్యాలు ఎక్కువ‌యిపోయాయి. ఎన్ని చ‌ట్టాలు, ఎన్ని శిక్ష‌లూ వ‌చ్చినా కూడా ఆక‌తాయిల ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట మాత్రం ప‌డ‌డం లేదు. దీని పై ప్ర‌భుత్వాలు కూడా ఎన్నో ర‌కాలుగా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ అమ్మాయిల‌పై జ‌రిగే అరాచ‌కాలు మాత్రం ఆగ‌డం లేదు. ఇటీవ‌లె ఇలాంటి ఘ‌ట‌న ఒక‌టి తెలంగాణ‌లో మ‌ళ్ళీ చోటు చేసుకుంది. మ‌హ‌బూబాబాద్ జిల్లాలో ఓ యువ‌తి పై ఆరుగురు మామాంధులు త‌మ ప్ర‌తాపాన్ని చూపించారు.  వివ‌రాల్లోకి వెళితే...

 


24ఏళ్ళ ఓ యువ‌తికి మ‌తిస్తిమితం స‌రాగా లేదు. ఆమెకు ఎవ్వ‌రూ లేరు. కొంత కాలం క్రిత‌మే త‌ల్లి చ‌నిపోయింది. ఆమె మంచిచెడులు ప‌ట్టించుకునేవారు ఎవ్వ‌రూ లేరు. మ‌తిస్థిమితం లేకపోవ‌డంతో తండ్రికి చెప్ప‌కుండానే బ‌య‌ట‌కు వెళ్లిపోయేది. ఈ క్రమంలోనే ఆమెకు అదే  ప్రాంతానికి చెందిన ఓ బాలుడు(16) పరిచయమయ్యాడు. అత‌డు క్యాట‌రింగ్‌లో ప‌ని చేస్తాడు. అతడు ఆమెతో తరుచూ ఫోన్లో మాట్లాడేవాడు. కొద్దిరోజులుగా ఆమె హైదరాబాద్‌లోని త‌న బంధువుల ఇంట్లో ఉంటున్న యువతి శుక్రవారం ఇంటికి బయలుదేరింది. సికింద్రాబాద్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఆ బాలుడికి ఫోన్ చేసింది. దీంతో అతడు ఆమెను కలిసేందుకు రావాలని అడ‌గ‌గా మహబూబాబాద్‌లో రైలు దిగి ఆటోలో రాత్రి 7గంటల స‌మ‌యంలో వెళ్లింది. అక్కడ యువతిని కలుసుకున్న బాలుడు రాత్రి 8.30 గంటల సమయంలో మహబూబాబాద్‌ రహదారిలో  ఉన్న‌ ఓ మామిడితోటలోకి ఆమెను బెదిరించి తీసుకు వెళ్ళాడు. ఆమె పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. 

 

అది చాల‌దంటూ ఆ అఘాంత‌కుడు త‌న స్నేహితులైన శ్రీ‌కాంత్ (18) అనే మ‌రో యువ‌కుడికి ఫోన్ చేశారు. ఆ యువ‌కుడితో  పాటు మ‌రో ఇద్ద‌రు కుర్రాళ్ళు రాగా. నలుగురు బాలురు మామిడితోటకు చేరుకుని ఆమె పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు భ‌యంతో కేకలు వేయగా అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గమనించారు. వెంట‌నే తోట యజమానికి ఫోన్‌ చేశారు. అతడు అక్కడికి చేరుకోగా ఆయన‌ను చూసి ఆరుగురు కామాంధులు పరారయ్యారు. అయితే ఈ ఘటనపై స్థానికులు వెంట‌నే డయల్ 100కి ఫోన్ చెప్పడంతో పోలీసులు వెంటనే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు.  అక్కడికి చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు. ఆమె చెప్పిన వివరాలు, కాల్స్‌ డేటా ఆధారంగా ఐదుగురు మైనర్లను శనివారం అరెస్ట్ చేశారు. ఇంకా పరారీలో ఉన్న శ్రీకాంత్‌ కోసం గాలిస్తున్నారు. మ‌రి ఎందుక‌ని ఎన్ని శిక్ష‌లు ఉన్న‌ప్ప‌టికీ ఎవ్వ‌రికీ కొంచ‌మైన భ‌య‌మ‌నేది ఎందుకు క‌ల‌గ‌డం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: