మెల్లగా కాలం మారుతోంది, దానితో పాటు మనిషి కూడా దానికి అనుగుణంగానే రకరకాల కొత్త ఆవిష్కరణలతో పాటు కొత్త జీవన విధానాలతో ముందుకు పరుగెత్తుతున్నాడు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మనిషి పుట్టుక దగ్గరి నుండి మరణం వరకు ప్రతి ఒక్క విషయం నేడు డబ్బుతో ముడిపడి ఉండడంతో మనిషి సంపాదన మీదనే ఎక్కుగా ధ్యాస పెడుతున్నాడు. నిజానికి సంపాదించడం, దానిని దాచుకోవడం మంచిదే. అయితే ఆ యావలో పడి నా అనే పదాన్ని పెంచుకుంటూ, మన అనే పదాన్ని నాశనం చేస్తూ ముందుకు పోతున్నాడు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, సాయంత్రం అయితే చాలు అందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ, 

 

ఆనందంగా కలిసి భోజనాలు చేసి అన్ని విషయాలు పంచుకుంటూ జీవించేవారు. ఇక ఎప్పుడైతే రాను రాను డబ్బు ప్రాముఖ్యత పెరిగిందో, మనిషి పూర్తిగా ప్రతి విషయంలో డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందా అని, కనీసం తన కుటుంబీకులను, బంధువులను సైతం పలకరించి ఆనందంగా మాట్లాడే పరిస్థితికి పూర్తిగా తిలోదకాలిస్తున్నాడు. ఎందుకంటే వారిని కలిసి మాట్లాడితే, వారు మాటల్లో తమ కష్టాలు ఎక్కడ చెపుతారో, తనని డబ్బులు ఎక్కడ అడుగుతారో అనే భయం. ఇక ఈ విషయాలు ప్రక్కన పెడితే, కనీసం ప్రతి రోజు పని యావ, ధనార్జనలో పడి పట్టుమని కడుపు నిండా భోజనం అయిన చేస్తున్నాడా అంటే అది కూడా చాలావరకు లేదనే చెప్పాలి. 

 

ఇక ఇంట్లోని వారందరూ క‌లిసి తినేందుకు కీల‌క‌మైన రోజుగా సాధార‌ణంగా నేటి ఉద్యోగ ప్ర‌పంచంలో మ‌ధ్యాహ్నాలు చాలా కుటుంబాలు మిస్స‌వుతున్నాయి. మ‌ధ్యాహ్నం పూట అంద‌రూ క‌లివిడిగా కూర్చుని భోజ‌నాలు చేయ‌డం అనేది అరుదు. అయితే, ఆదివారాలు మాత్రం ఆ లోటును భ‌ర్తీ చేస్తాయి. కాక‌పోతే, ప‌క్కా ప్లాన్‌తో చేసుకుంటే అంద‌రికీ కీల‌కమైన రోజుగా ఆదివారం మారుతుంది. చక్కడ అన్ని పనులు ముగించుకుని మన వారితో కలసి ఆరోజైన హాయిగా కబుర్లు చెప్పుకుంటూ, ఆనందంగా భోజనం చేస్తే, అబ్బా ఆ తృప్తి ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది చెప్పండి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: