మున‌క్కాయ ఎక్కువ‌గా సాంబార్‌లో వేసుకుంటారు. మున‌క్కాడ సాంబార్ అంటే అస‌లు తిన‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. సాంబార్ చేస్తున్నాం అంటే అందులో మున‌క్కాడ ఉందా అని అడుగుతారు చాలా మంది. దాని వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఎక్కువ‌నే చెప్పాలి. మునక్కాయలోని విటమిన్లు, ఐరన్, కాల్షియంలు ఎముకలు పటిష్టంగా ఉంచేందుకు దోహదపడతాయి. మునగాకు.. మునగ విత్తనాలు.. మునక్కాయలు.. ఇలా అన్నింటినీ వంటల్లో వినియోగిస్తారు. మునగ విత్తనాలతో డయాబెటీస్‌, అనీమియా, హార్ట్‌ డిసీజ్‌, లివర్‌ డిసీజ్‌, ఆర్థ్రైటీస్‌, జీర్ణసమస్యలు, అనేక చర్మ రోగాల నుంచి ఉపశమనం పొందొచ్చు. అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్ ఒక‌టి స్డడీ చేసింది. ఏమిటంటే... నివేదిక ప్రకారం మునక్కాయల్లో ఆప్రోడైసియాక్ అనే పదార్థం ఉంటుందని దాని వల్ల పురుషుల్లో సెక్స్ హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ లెవెల్స్ బాగా పెరుగుతాయని తేల్చి చెప్పారు. అయితే మరి ఈ మునక్కాయలతో మటన్ కలిపి టేస్టీ కర్రీ చేసుకొని తింటే ఇక బెడ్ మీద ర‌చ్చ రంబోలానే అంటున్నారు వైద్య నిపుణులు. మ‌రి దాని గురించి తెలుసుకుందాం

 

మ‌రి  మునక్కాయ మటన్ కర్రీతో అటు మటన్ లోని ప్రోటీన్స్, అలాగే మునక్కాయలోని ఆప్రోడైసియాన్ కలిస్తే కొత్త‌గా పెళ్ళైన‌వారు శృంగార యాత్రకు బాగా కలిసి వస్తుందని పెద్దలు చెబుతున్నారు. మ‌ట‌న్ చాలా బ‌లం అలాగే మ‌ట‌న్ కూడా చాలా వేడి. మ‌రి ఇక ఆలస్యం దేని ఈ కర్రీని ఎలా చేస్తారో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టి. అందులో నూనె పోయాలి. నూనె వేడయ్యాక అందులో ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్టును వేయాలి.  అందులో చిన్న చిన్న‌గా కోసుకున్న‌ మటన్ ముక్కలను వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత మునక్కాయలను ముక్కలు కడాయిలో వేయాలి. మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మటన్ కాబట్టి ఉడకడానికి కాస్త సమయం పడుతుంది...5 నిమిషాల తరువాత ముక్కలు బాగా ఉడుకుతాయి.

 

ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసి మూత పెట్టాలి. త‌రువాత చిటికెడు ప‌సుపు, చివరగా కారం, ధ‌నియాల‌పొడి వేసుకోవాలి, మటన్, మునక్కాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కొద్దిగా నీళ్లు పోయాలి. స్టౌమీద సన్నటి సెగ మీద కూరను సిద్ధం చేసుకోవాలి. నీరు బాగా ఇంకేంత వరకు కూరను ఉడికించాలి. చివరకు కొత్తిమీర కలపాలి.. వేడి వేడి మునక్కాయ మటన్ కర్రీని అన్నంలో కానీ, రోటీలో కానీ కలుపుకొని తింటే ఉంట‌ది ఇక ర‌చ్చ‌రంబోలానే అంటున్నారు పెద్ద‌లు.  కావాల‌నుకుంటే డ్రెస్సింగ్ కోసం జీడిపప్పును వాడితే మరింత రుచి యాడ్ అవుతుంది. అయితే దీన్ని కొంత మంది కుక్క‌ర్‌లో ఉడికిస్తారు అలా చేయ‌డం వ‌ల్ల మున‌క్కాయ బాగా మెత్త‌గా ఉడికిపోయి పీస్ పీస్ అయిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: