పగతో రగిలిపోతున్న ఒక థాయిలాండ్ సైనికుడు 26 మంది అమాయక ప్రజలను ఆటోమేటిక్ మిషన్ గన్ తో విచక్షణ రహితంగా కాల్చి చంపేశాడు. అలాగే అతడు జరిపిన దారుణమైన కాల్పులలో మరో 57 మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు చెప్పిన ప్రకారం.. 32 ఏళ్ల జక్రపంత్ తొమ్మా అనే ఒక సైనికుడు ఒక ఆర్థిక విషయానికి సంబంధించి తన మిలిటరీ బేస్ లోని ఇద్దరు ఆఫీసర్స్ తో వివాదం పెట్టుకున్నాడు. ఆ వివాదం కాస్త పెరిగిపోవడంతో జక్రపంత్ ఆ ఇద్దరిని కాల్చి చంపాడు. తరువాత ఒక మోటార్ బైక్ పై ఖోరత్ నగరంలో తిరుగుతూ బీభత్సము సృష్టించాడు. ఈ క్రమంలోనే ఒక షాపింగ్ మాల్ లోకి ప్రవేశించి.. అక్కడికి వచ్చిన వారిని దిగ్బంధం చేశాడు. అప్పటికే తీవ్ర భయభ్రాంతులకు గురి అయిన అమాయక ప్రజలు తప్పించుకునేందుకు యత్నించారు. కానీ సైనికుడు జక్రపంత్ వారిపై విచక్షణ రహితంగా ఒక ఆటోమేటిక్ మిషన్ గన్ తో కాల్పులు జరిపాడు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.



విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి షాపింగ్ మాల్ ని మోహరించారు. అయితే, సైనికుడిని హతమార్చే క్రమంలో ఇద్దరు పోలీసులు మరణించారు. చిట్టచివరికి చాలా శ్రమతో జక్రపంత్ ని పోలీసులు హతమార్చారు. అలాగే జక్రపంత్ అధీనంలో ఉన్న 8 మందిని విడిపించారు.


దీంతో ఆ దేశ ప్రజా ఆరోగ్య శాఖ మంత్రి అనుతిన్ చరన్‌విరాకుల్ పోలీసులకు ధన్యవాదములు తెలిపారు. ఆ దేశ ప్రధాని ప్రయుత్ గాయపడిన వారి వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. అలాగే ఈ దాడిలో 26మంది చనిపోయారని.. 57 మంది గాయపడ్డారని చెప్పాడు. ఈ మాస్ మర్డర్ జరిగే సమయంలో సైనికుడు 'మరణం నుండి ఎవరూ తప్పించుకోలేరు', అని తన ఫేసుబుక్ ఖాతాలో రాసి తాను పట్టుకున్న గన్ ఫోటోని పోస్ట్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: