ఏపీలో జగన్ సర్కార్ తీసుకునే పలు నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి.. అసలు టీడీపీ పార్టీనే భూస్దాపితం చేయాలని కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తున్న జగన్ తీరు, బాబుగారి వర్గానికి నిదుర లేకుండా చేస్తుందన్న సంగతి అందరికి తెలిసిందే.

 

 

ఇప్పటికే పెద్ద బాబుని పేదబాబుగా మార్చి, చిన్న బాబుకి గల్లి బాబుగా ప్రమోషన్ ఇచ్చి, రాజాకీయాన్ని చందరంగంలా ఆడేస్తున్న జగన్, బాబు అవినీతి తుట్టెను కదిలించి ఇంత కాలం అందులో ఉన్న తేనెను జుర్రు కుంటున్న ఒక్కొక్క తేనే టీగల బండారాన్ని బయటపెడుతున్నాడు.. ఇది చాలదన్నట్లుగా, పచ్చ జెండాను ఇంకా మోస్తున్న వారిని పరిగెత్తిస్తున్నాడని అందరు అనుకుంటున్నారు.

 

 

ఈ సమయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి.. మాజీ ఇంటెలిజన్స్ చీఫ్ ఏ బి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వును కూడా జారీ చేసింది. ఇకపోతే శనివారం పొద్దుపోయిన తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం.. ఆలస్యంగా బయటకు వచ్చింది.

 

 

ఇక ఆయనపై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో డీజీపీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ఏపీ ప్రభుత్వం.. నివేదిక ఆధారంగా ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. అంతే కాకుండా సస్పెన్షన్ లో ఉన్న కాలంలో ఆయన బెజవాడను దాటి బయటకు వెళ్లే వీల్లేదు. అలా చేయాలంటే ఆయన ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.  

 

 

ఇక ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది... ఏది ఏమైనా జగన్ వేస్తున్న అడుగులు ఏపీ భవిష్యత్తుకు పునాదుల్లా మారి, అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా మారితే రాబోయే తరాలకు కష్టాలు ఉండవు. కానీ ఫలితాలు తారుమారైతే ఆ రాష్ట్ర పరిస్దితి ఏంటనీ కొందరు విశ్లేషకులు చర్చించుకుంటున్నారట..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: