భారతదేశంలోని అతి పెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీని ఇప్పుడు ఎవరు లెక్క చేసే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే వారి మనుగడ అంతంత మాత్రంగా ఉంటే చివరికి పార్టీ అందరికీ అంగడి లో సరుకులాగా కనపడుతూ ఉంది. ఇక విషయానికి వస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఏపీ 3 రాజధానుల పాలసీకి రాష్ట్ర బిజెపి తాము వ్యతిరేకమని ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం నుంచి మాత్రం వారికి ఎటువంటి సపోర్టు రాలేదు. ఇకపోతే రాజ్యసభ సభ్యుడైన జీవీఎల్ నరసింహారావు బిజెపి దృష్టిలో ఇప్పటికీ ఏపీ రాజధాని అమరావతి అనే ఉంది కానీ తమ రాష్ట్రంలో రాజధాని ని ఎక్కడికి మార్చాలి అన్న అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కానీ కేంద్రం దీనిలో ఎటువంటి జోక్యం చేసుకోదని కూడా స్పష్టం చేశారు.

 

ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వారు కేంద్ర బిజెపి నుండి ఇటువంటి సమాధానం రావడంతో దానికి జీవీఎల్ నరసింహారావు ని బలిపశువును చేశారు. అంతా కలిసి మూకుమ్మడిగా నరసింహారావు పై పడి తీవ్రమైన విమర్శలు చేయడం మరియు దానిని అతని సొంత పార్టీ అయిన రాష్ట్ర బిజెపి ఖండించక పోవడం గమనార్హం. ఇప్పుడు రాష్ట్ర బిజెపి పార్టీ యొక్క నిర్ణయాలకు విరుద్ధంగా నరసింహారావు ప్రవర్తిస్తే అతనిపై పార్టీ వారు చర్యలు తీసుకోవాలి కానీ ఇతర పార్టీలు అతనిని ఆన్నేసి మాట్లాడడం ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

 

జీవీఎల్ నరసింహారావు ఖచ్చితంగా చెప్పాలంటే పార్లమెంటు సభ్యుడు కేంద్రం ప్రభుత్వం యొక్క భావనలు మరియు నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసే పనిలో ఉన్న అతనికి ఏం మాట్లాడాలో పొరుగు పార్టీ వారు చెప్పడం నిజంగానే విచిత్రం. తెలుగుదేశం పార్టీ వారు తమ ఎమ్మెల్యేలకు మంత్రులకు బయట ఏం మాట్లాడాలో చెప్పాలి కానీ ఇతర పార్టీ నేతలకు కూడా ఎలా వ్యవహరించాలో తెలియజేయడం మరియు ఇదంతా చూస్తున్న బిజెపి పార్టీ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అటు దేశంలో మరియు రాష్ట్రంలో బిజెపి యొక్క దీనస్థితిని తెలియజేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: