త‌ల్లిదండ్రులు త‌ర్వాత గురువే దైవం అంటారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. మంచి చెడులు చెప్పే గురువులే పైశాచిక‌రంగా మారి అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్నారు. ఒక ప‌విత్ర‌మైన గురువు స్థానంలో ఉండి కూడా ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు ఎలా పాల్ప‌డుతున్నారో అర్ధం కావ‌డం లేదు. అందులోని ఒక లేడీ టీచ‌ర్ ఇలాంటి ప‌నులు చేస్తుందంటే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంద‌న‌డంలో ఎలాంటి అనుమానాలు లేవు. పాఠాలు చెప్పి మంచి చెడుల‌ను నేర్ప‌వ‌ల‌సిన టీచ‌రమ్మ త‌న కామ వాంఛ‌ను తీర్చుకుంది. 

 

వివ‌రాల్లోకి వెళితే...అమెరికాలోని లూసియానాలోని మిడిల్ స్కూల్లో ఎల్ల‌రియా సిల్వా అనే మ‌హిళ (34) సైన్స్ టీచ‌ర్‌గా ప‌ని చేస్తోంది. 15ఏళ్ళ వ‌య‌సున్న విద్యార్ధిని త‌న ఇంటికి పిలిపించుకుంది. ఆ త‌ర్వాత త‌న‌ని రెచ్చ‌గొట్టి ఆమె లైంగిక వాంఛ‌ను తీర్చుకునేది. ఇలా క‌నీసం 10సార్లు ఆమె త‌న కామ వాంఛ‌తీర్చుకునేందుకు అత‌డిని ఇండికి పిలిపింకుని అఘాయిత్యానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు స‌మాచారం ఇచ్చారు. పోలీసుల దర్యాప్తులో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ఇంట్లో తన సొంత బిడ్డ ఉన్నప్పుడే స్టూడెంట్‌తో లైంగిక సంబంధంపెట్టుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తన నగ్న ఫోటోలు, వీడియోలను కూడా ఆ టీచర్..స్టూడెంట్‌కు ఈ-మెయిల్ పంపినట్లు పోలీసులు నిర్ధారించారు.

 

తీగ‌లాగితే డొంకంతా క‌దిలిన‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తులో కొన్ని నిజాలు తెలిశాయి. సిల్వా కామ పైశాచికం మొత్తం బ‌య‌ట‌పెట్టింది. శారీర‌క సంబంధం కోసం ఆమె చేసిన ఆరాచ‌కాల‌న్నీ ఒకొక్క‌టిగా బ‌య‌ట పెట్టింది. స్కూల్‌కు సంబంధించిన అధికారిక ఈ-మెయిల్ ద్వారానే టీచర్ స్టూడెంట్‌కి ఈ-మెయిల్ పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత పర్సనల్ ఈ-మెయిల్ ద్వారా ఇద్దరు మాట్లాడుకునేవారు. తన నగ్న ఫోటోలు, వీడియోలను స్టూడెంట్‌కి పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది.

 

కారులో త‌న ఇంటి నుంచి టీచ‌ర్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళేది, అక్క‌డ త‌న‌కు కావ‌ల‌సిన విధంగా లైంగిక వాంఛ‌ను తీర్చుకుని పంపించేది. ఇదంతా పోలీసుల విచార‌ణలో స్టూడెంట్ తెలిపాడు. స్టూడెంట్‌లో ఆ కోరిక‌లు పెరిగేందుకు గంజాయిలాంటి మాధ‌క ద్ర‌వ్యాల‌ను కూడా అత‌నికి వ‌చ్చేద‌ని అనుమానాలు కూడా వ్యక్త‌మ‌వుతున్నాయి.  జువెనైల్ చట్టంలో పలు సెక్షన్ల కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్టూడెంట్ పట్ల టీచర్ తీరును స్థానికులు, స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి వాళ్ళ వ‌ల్లే స‌మాజం ఇలా పాడేపోతుందంటూ అంద‌రూ ఆమెను శిక్షించాలంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: