అమ్మాయిల మీద వరుసగా జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో తీవ్ర నిరసనలను వెళ్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దోషులకు విధించే శిక్షల విషయంలో, శిక్షల అమలు విషయంలో జరుగుతున్న జాప్యం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దిశ ఘటన తరువాత తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు చేసినా వాటి వల్ల జరుగుతున్న మంచి చాలా తక్కువే. అందుకే ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయి.

 

అయితే తాజాగా ఇలాంటి ఓ కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సంఘటనలో బాధితురాలికి ఏకంగా 7.8 కోట్ల రూపాయల పరిహారం ప్రకటించింది న్యాయస్థానం. ఈ సంఘటన ఐర్లాండ్‌లో జరిగింది. పదేళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన ఐర్లాండ్‌ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది.


రేప్‌ కేసులో బాధితురాలికి ఐర్లాండ్ కోర్టు 1 మిల్లియన్ యూరోల (రూ.7 కోట్ల 80 లక్షల) పరిహారం ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. 10 ఏళ్ల క్రితం మహిళ నిద్రిస్తున్న సమయంలో నార్వేకి చెందిన ఆమె స్నేహితుడు ఆమెపై అత్యాచారం చేశాడు. అంతేకాదు తరువాత పలుమార్లు ఆమెపై లైగింక దాడికి కూడా పాల్పడ్డాడు. ఆ సంఘటననంతా వివరిస్తూ ఆ మహిళకు ఓ మెయిల్ పంపి ఆమెను భయబ్రాంతులకు గురిచేశాడు.

 

దీంతో ఆ మహిళ మానసిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోన్న బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ సంఘటన తరువాతాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని ఎక్కడి వెళ్లినా అభద్రతా భావం కలుగుతోంది కోర్టుకు వివరించింది. నా తల్లిదండ్రులను కూడా నమ్మలేకపోతున్నాని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు తాను ఒకసారి ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్టు వివరించింది.

 

ఈ కేసులో తన నేరాన్ని అంగీకరించిన నిందితుడు ఇప్పటికే  15 నెలల జైలుశిక్షను అనుభవించాడు. అయితే ఐర్లాండ్‌ చట్టాల ప్రకారం రేప్ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అయితే ఈ కేసులో బాదితురాలు తనకు నష్టపరిహారం కావాలని కోర్టుతో కోర్టు అందుకు అంగీకరించి 7 కోట్ల 80 లక్షల పరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: