మామూలుగా అయితే కామంతో కళ్లు మూసుకుపోయిన మగాళ్ళు ఆడపిల్లలపై అత్యాచారాలు చేసే ఘటనలు... లేదా పవిత్రమైన గురువు వృత్తిలో ఉన్నవారు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడే ఘటనలు  ఈమధ్య చాలా తెరమీదకు వస్తున్నాయి. కానీ ఓ మహిళ ఒక అబ్బాయి పై లైంగిక వేధింపులకు పాల్పడడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ తను ఏదో మామూలు మహిళా  అనుకునేరు... ఎంతో గౌరవమైన పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న మహిళ. తన దగ్గర చదువుకునే విద్యార్థితో లైంగిక వాంఛలు తీర్చుకున్నది . ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చే లా... ఆ మహిళా టీచర్ వ్యవహరించింది. స్కూల్లో చదువుతున్న విద్యార్థి తో లైంగిక వాంఛ తీర్చుకున్న వ్యవహారం కాస్త బయటపడడంతో ఆ మహిళా టీచర్ కటకటాలపాలయ్యాడు. 

 


 వివరాల్లోకి వెళితే... అమెరికాలోని లూసియానా లో మిడిల్ స్కూల్లో 34 ఏళ్ల ఓ మహిళ సైన్స్ టీచర్గా పనిచేస్తోంది. అయితే కామంతో రగిలిపోయిన ఉపాధ్యాయురాలు తన స్కూల్లో ఓ విద్యార్థుతో కామ వాంఛ తీర్చుకోవాలని అనుకుంది. అయితే ఆ విద్యార్థితో శారీరక సంబంధం పెట్టుకోవడం కోసం ముందుగా... పాఠశాల అధికారిక ఈమెయిల్ ద్వారానే టీచర్ స్టూడెంట్ కు ఈ మెసేజ్ పంపేది. ఆ తర్వాత  పర్సనల్ ఈమెయిల్ ద్వారా ఇద్దరు మాట్లాడుకునే వారు. ఈ క్రమంలోనే మహిళా టీచర్ తన నగ్న ఫోటోలను వీడియోలను స్టూడెంట్ కి పంపింది... తర్వాత తన మనసులో ఉన్న మాటను ఆ విద్యార్థికి  చెప్పింది. ఇక దానికి అంగీకరించిన విద్యార్థిని ఇంటికి రప్పించుకొని లైంగిక వాంఛ తీర్చుకుంది. 

 

 నగ్న ఫోటోలు వీడియోలతో ఆ విద్యార్థిని వలలో వేసుకుని టీచర్... తన కారులో విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లి లైంగిక వాంఛ తిర్చుకునేది. కామ వాంఛ ఎక్కువ అవడానికి ఆ విద్యార్థికి గంజాయి కూడా ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఓ విద్యార్థి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా ఈ వ్యవహారం మొత్తం బయట పడింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంతో పవిత్రమైన గౌరవప్రదమైన టీచర్ వృత్తిలో కొనసాగిన ఆ మహిళ ఇంత నీచ ఆలోచన చేసి విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరించిందని...ఆమెను  కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: