రోజు రోజుకి మానవత్వం మంటగలిసి పోతుంది. ఆడవాళ్లు కూడా అమానుషంగా ప్రవర్తించి అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. మంచి చెడు చెప్పాల్సిన ప్రజలు కూడా మనకెందుకులే అనే ధోరణి లో ప్రవర్తించి సాటి మనిషికి సహాయం చేసే లక్షణాలను పూర్తిగా మర్చిపోతున్నారు. ఈ మాటలన్నింటికీ నిదర్శనంగా విశాఖలో జరిగిన ఒక సంఘటన నిలుస్తుంది. 

 

వివరాల్లోకి పోతే.. గుత్తి లక్ష్మీ అనే ఓ 35 ఏళ్ల వివాహిత ఎల్లపువానిపాలెం గ్రామంలో భర్త నాగరాజు, పిల్లలతో కలిసి ఒక అద్దెకు ఇంటిలో నివాసం ఉంటోంది. అయితే నిన్న సాయంత్రం భర్త ప్రైవేటు ఇందులో తన విధులను నిర్వహించే ఎందుకు పోయినప్పుడు విశాఖ నగరానికి చెందిన ఐదుగురు ఆడవారు.. ఇద్దరు పురుషులు కారులో వచ్చి ఆమెపై దాడి చేశారు. లక్ష్మిని జుట్టు పట్టుకొని తన ఇంటి నుండి బయటికి తీసుకువచ్చి ఒక అర కిలోమీటర్ వరకు ఈడ్చుకుంటూ 7 గురు కలిసి ఒకేసారి దాడి చేశారు. ఈ దృశ్యాలన్నీ ఉహించుకోవడానికి చాలా బాధగా ఉంది.

 

కానీ అక్కడే ఈ అమానుష చర్యలను చూస్తున్న ప్రజలు మాత్రం లక్ష్మిని విడిపించడానికి ఏ మాత్రం ముందుకు రాలేదు. ఈ దుండగులంతా ఇష్టారాజ్యంగా ఒక యువతిని కిరాతకంగా కొడుతుంటే.. కాపాడండి అంటూ ఆమె చేసిన రోదించినా.. కనీసం ఆపండని ఒక్కరు కూడా అనలేదంట. ఆ తర్వాత గ్రామ చివరిలో ఆపిన కారులో ఆమెను ఎక్కించి తమవెంట తీసుకెళ్లారు. 


ఇదంతా అయిపోయిన తరువాత ఈ దారుణ ఘటన పై ఒక పోలీసు కేసు నమోదు అయింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే ఆమెపై ఈ ఏడుగురు ఎందుకు దాడి చేశారో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో... కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దాడికి ఆ ఏడుగురు ఒడిగట్టి ఉంటారని తేల్చారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: