పెరిగిన ఉల్లి రేట్లను కంట్రోల్ చేయటానికి టర్కీ నుంచి దిగుమతులు చేసింది ఏపీ ప్రభుత్వం. చివరికి అవి కూడా నిరుపయోగమే అయ్యాయి. కుళ్లిపోయి, మొలకలు వచ్చిన ఉల్లిపాయలు బస్తాల కొద్దీ నిరుపయోగంగా  పడి ఉన్నాయి. 

 

విశాఖలో ఉల్లి సమస్య ఇంకా తీరలేదు. ఆకాశాన్నంటే ధరలకు విరుగుడుగా ప్రభుత్వం సబ్సిడీకి సరఫరా చేసింది. డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై చేయటానికి టర్కీ నుంచి దిగుమతి చేసి అందించే ప్రయత్నం బెడిసి కొట్టింది. టర్కీ ఉల్లి వినియోగదారుల అసంతృప్తికి కారణమయ్యాయి. నెలల తరబడి రవాణాలో ఉండటంతో చాలా వరకు కుళ్లిపోయాయి. కొన్ని మొలకలు వచ్చి నిరుపయోగంగా  మారిపోయాయి.

 

ఓ పక్క వరదలతో దేశవ్యాప్తంగా ఉల్లికి కొరత వచ్చింది. దీంతో లోకల్ ఉల్లికి డిమాండ్ అమాంతం పెరిగింది. కిలో వంద, రెండొందల దిశగా వెళ్లటంతో ఉల్లి మాటెత్తితో ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో, తక్కువ ధరకు ఉల్లిపాయలను విక్రయించేందుకు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా పొరుగు రాష్ట్రాల నుండి, పొరుగు జిల్లాల నుండి దిగుమతి చేసుకుని విక్రయించింది. కానీ ఈ సారి ఏకంగా విదేశాల నుండి ఉల్లిపాయలను దిగుమతి చేసుకుని నగర వాసులకు పంపిణీ చేయాలనుకుంది ప్రభుత్వం. రైతు బజారుల్లో అమ్మకం దారులకు టర్కీ ఉల్లిని అందించి వాటిని వినియోగదారులకు తక్కువ ధరకే అందించాలని సూచించింది. 

 

ఇప్పుడు కూడా ఉల్లి రిటెయిల్‌ మార్కెట్‌ లో కిలో రూ.50 పలుకుతోంది. దీంతో  విశాఖలో టర్కీ ఉల్లి వచ్చిందని తెలియటంతో ఉల్లి కోసం క్యూ కట్టారు జనాలు. ఉదయం నుండి సాయంత్రం వరకు మార్కెట్ లో వేచిచూసారు. తీరా చూస్తే, టర్కీ ఉల్లి వెక్కిరిస్తూ కనిపించింది. కుళ్లిపోయి, మొలకలు వచ్చిన ఉల్లి ఎవరికీ పనికి రాకుండా తయారయింది. 

 

టర్కీ ఉల్లి సబ్సీడీ కింద తక్కువ ధరకే వస్తుందని ఆశించిన విశాఖ నగరవాసులకు అసంతృప్తి మిగిలింది. ఎంతో ఖర్చు పెట్టి దిగుమతి చేసిన ఉల్లిపాయలు నిరుపయోగంగా మిగిలిన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు వెయ్యి కిలోలు తెప్పిస్తే, వాటిలో 600 కిలోల ఉల్లి ఎవరికీ కాకుండా పోయాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: