ప్రపంచంలో టిక్‌ టాక్‌ వీడియోలతో పాపులర్ అయ్యేందుకు యూజర్లు ఎలాంటి వేషాలు వేస్తున్నారో మనందరికీ తెలిసిందే. తెలుగులో కూడా చాలా మంది చిత్రవిచిత్ర వీడియోలతో పాపులారిటీ సంపాదించినవాళ్లే ఉన్నారు. ఏదేదో తెలుగు సామెతలా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా మరికొందరు వారి మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. ఇందులో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేయడమే కాకుండా, వాటిని దమ్ముంటే చేసి చూపించాలని పిచ్చి సవాళ్లు విసురుతున్నారు. ఇలాంటి ఛాలెంజ్‌లు వినోదాన్ని పంచడానికి బదులు ప్రమాదాలను తెచ్చిపెడుతోంది అని చెప్పవచ్చు.

 

 


ఈ మధ్య కాలంలో టిక్‌టాక్ ‘ఔట్‌లెట్ ఛాలెంజ్’ ఎలాంటి ప్రమాదాలను తెచ్చిపెట్టిందో అందరికి తెలిసిందే. యూజర్లు ఫ్లగ్ పిన్‌ లకు మొబైల్ ఛార్జర్లను పెట్టి రూపాయి బిల్లను సాకెట్, ఫ్లగ్ మధ్యలో పెట్టి ఇంట్లో కరెంటు నిలిపేయడమే ఈ ఛాలెంజ్ ముఖ్యమైన ఉద్దేశం. ఈ ఛాలెంజ్ వల్ల అగ్నిప్రమాదాలు చాలా చోటుచేసుకున్నాయి. దీనితో అగ్నిమాపక అధికారులు ఇలాంటి ఛాలెంజ్‌ లు చేస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని అయన హెచ్చరించారు.

 

 

అయితే ఇప్పుడు స్కల్‌ బ్రేకర్ ఛాలెంజ్ ట్రెండీగా సాగుతోంది. తాజాగా టిక్‌ టాక్‌ లో మరో ప్రమాదకరమైన ఛాలెంజ్ ‘స్కల్‌బ్రేకర్’ పేరుతో చెలామణి అవుతున్న ఈ ఛాలెంజ్‌ తో యూజర్లు తమ తలలను పగలగొట్టుకుంటున్నారు. స్పెయిన్‌ దేశంలో  ‘రాంపే క్రానియోస్’ పేరుతో మొదలైన ఈ ఛాలెంజ్‌ ఇప్పుడు అన్ని దేశాలకూ చేరింది. దీనిని ఎక్కువగా స్కూళ్లు, కాలేజీల్లో ఈ ఛాలెంజ్ చేస్తున్నట్లు సమాచారం.

 

 

ఇందులో అసలు ఏం చేస్తారంటే ముగ్గురు యువకులు డ్యాన్ చేసేందుకు లైన్లో నిలబడిఉంటారు. ముగ్గురు ఒక్కసారే జంప్ చేసి అందులో మధ్యలో ఉన్న వ్యక్తి జంప్ చేస్తుండగా అతడికి అటూ ఇటూ నిలుచున్న యువకులు కాళ్లను అడ్డుపెట్టి కిందపడేస్తారు. దీనితో మధ్యలో ఉండే వ్యక్తి నడుము విరుగుతుంది లేదా తల నేరుగా నేలను కొట్టుకుంటుంది అని చెప్పవచ్చు. వెనిజులాకు చెందిన ఓ యువకుడు  ఈ ఛాలెంజ్ వల్ల హాస్పిటల్ లో చేరాల్సి వస్తుంది. కాబట్టి, ఏదిఏమైనా మీరు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించే ప్రయత్నం చేయక పోవడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: