ప్రమాదం ఏ వైపునుండి పోంచి ఉంటుందో చెప్పడం కష్టం.. ఆనందంగా వెళ్లి వస్తా అని ఇంట్లో వారికి చెప్పి బయటకు వెళ్లిన మనిషి, తిరిగి ఇళ్లు చేరేవరకు నమ్మకం తక్కువైన రోజుల్లో బ్రతుకుతున్న మనం ఏ క్షణం మృత్యువు వాత పడతామో, ఏ నిమిషం అంగ వైకల్యాన్ని పొందుతామో అంచనా వేయడం కష్టం.. అసలు మనుషులకు భద్రత కరువైన ఈ బ్రతుకుల్లో నిత్యం జీవన పోరాటం చేయడం దిన దిన చర్యగా మారింది. ఈ బ్రతుకు పాలిట గండంగా తయారు అయ్యింది...

 

 

ఇక బయటకు వెళ్లాలంటే భయపడే మనిషి తన అవసరాల కోసం వెళ్లక తప్పని పరిస్దితి.. ఇక ఆప్పుడప్పుడు రోడ్దు పైన జరిగే ప్రమాదాలను చూస్తుంటే ఒళ్లు గగ్గుర్లు పొడుస్తుంది.. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి ఒడిశాలో జరిగింది.. ఈ ఘటనను పరిశీలిస్తే గంజాం జిల్లాలో బొలంత్ర పరిధిలోని మంద్‌రాజ్‌పూర్‌ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సుకు విద్యుత్‌ తీగలు తగిలి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 40 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సుపై 11కెవి విద్యుత్‌ లైన్‌ తీగలు తెగిపడి భారీ ఎత్తున మంటలు వ్యాపించడంతో ఈ దారుణం జరిగింది.. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

 

అలాగే అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కాగా, ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ప్రమాదానికి గురైన వారంతా దగ్గరి బంధుత్వాన్ని కలిగి ఉన్నారట.. ఈ ప్రమాదానికి గురైన వారు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగిందని సమాచారం.. ఇకపోతే ఈ ఘటన తాలూకూ పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.. ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగిన కొన్ని కుటుంబాలు మాత్రం రోడ్దున పడ్దాయి.. వారి బ్రతుకుల్ని చీకట్లోకి నెట్టాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: