ఏపీలో ఓ ఐపీఎస్ అధికారి తీరు ఆశ్చర్యం గొలుపుతోంది. ఏకంగా సీఎంనే సవాలు చేస్తున్నట్టుగా ఉంది. సర్కారు చర్యపై కవ్వించే తీరులో ప్రకటన చేశారు. జగన్ ఏం చేసుకుంటాడో చేసుకోవచ్చు అన్నట్టుగా ఆ ప్రకటన ఉంది. ప్రభుత్వఈ చర్యను ఎదుర్కొనేందుకు చట్టపరంగా తనకున్న అవకాశాలను పరిశీలిస్తున్నానని ఆయన తన ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

 

గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీప్ గా పనిచేసిన ఎబి వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్ పై స్పందించారు. తన బంధువులు , స్నేహితులను ఉద్దేశించి ఈ ప్రకటన చేశారు. మీడియాలో వస్తున్న కథనాలలో వాస్తవం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల మానసికంగా తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని వెంకటేశ్వరరావు అన్నారు. అంతే కాదు.. ఆయన తెలుగుదేశం నేతలతోనూ సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దిగుతున్నారు.

 

విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని ఇంటెలెజెన్స్ మాజీ ఛీప్ ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై విభిన్నంగా స్పందించారు. అసలు టిడిపి ఓడిపోవడానికి వెంకటేశ్వరరావే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. నాని ట్విటర్ లో చేసిన వ్యాఖ్యలపై వెంకటేశ్వరరావు కూడా ఘాటుగానే స్పందించారు. ఔనా.. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో నా వల్లే వైసీపీ ఓడిపోయిందని ఆ పార్టీ వాళ్లు అన్నారంటి.. అని ఎదురు ప్రశ్నించారు. ఇప్పుడు వీరి మాటల యుద్ధం కూడా హాట్ టాపిక్ అయ్యింది.

 

ఇక చంద్రబాబు ప్రభుత్వం లో ఒక వెలుగు వెలిగిన ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఎ బి వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన దేశ భద్రతా రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని, ప్రవర్తనా నియమావళిని పాటించలేదని ఛీప్ సెక్రటరీ నీలం సహానీ విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. భద్రతా పరికరాల కొనుగోలులో అనేక అవకతవకలకు పాల్పడ్డారని కూడా అభియోగం మోపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: