చంద్రబాబు ప్రభుత్వం లో ఒక వెలుగు వెలిగిన ఐపీఎస్ అధికారి.. ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఎ బి వెంకటేశ్వరరావు. ఆయన చంద్రబాబుకు తొత్తుగా మారి టీడీపీ కార్యకర్తగా పని చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు జగన్ అధికారంలోకి రాగానే ఆయనకు వేధింపులు మొదలయ్యాయి. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా అభియోగాలు మోపి సస్పెండ్ చేసేసింది.

 

ఏబీ వెంకటేశ్వరరావు.. దేశ భద్రతా రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని, ప్రవర్తనా నియమావళిని పాటించలేదని ఛీప్ సెక్రటరీ నీలం సహానీ విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. భద్రతా పరికరాల కొనుగోలులో అనేక అవకతవకలకు పాల్పడ్డారని కూడా అభియోగం మోపారు. దేశవ్యాప్తంగా ఒకే తరహా ప్రోటోకాల్స్ ఉంటాయని, నిఘా అదికారులువాటిని పాటించవలసి ఉంటుందని, వాటిని ఎబి వెంకటేశ్వరరావు పట్టించుకోలేదని సస్పెన్షన్ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

 

అయితే ఈ సస్పెన్షన్ ను అడ్డుపెట్టుకుని జగన్ సర్కారు కక్ష సాధిస్తుందని రచ్చ చేయాలని చంద్రబాబు ఓవైపు ఆలోచిస్తుంటే.. ఇప్పుడు తెలుగు దేశం నేతలే ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని ఇంటలెజెన్స్ మాజీ ఛీప్ ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై విభిన్నంగా స్పందించారు. అసలు టిడిపి ఓడిపోవడానికి వెంకటేశ్వరరావే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇది టీడీపీ నేతలు చాలా మందిలో ఉన్న అభిప్రాయమే.

 

కేశినేని నాని ట్విటర్ లో చేసిన వ్యాఖ్యలపై వెంకటేశ్వరరావు కూడా ఘాటుగానే స్పందించారు. ఔనా.. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో నా వల్లే వైసీపీ ఓడిపోయిందని ఆ పార్టీ వాళ్లు అన్నారంటి.. అని ఎదురు ప్రశ్నించారు. ఓవైపు ఈ సస్పెన్షన్‌ ద్వారా రచ్చ చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తుంటే.. ఇటు వెంకటేశ్వరరావు టీడీపీ నేతలపైనే విమర్శలు చేయడం.. టీడీపీ నేతలు కూడా వెంకటేశ్వరరావుపై విమర్శలు చేయడం చూసి చంద్రబాబు తలపట్టుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: