ఈ మధ్యకాలంలో ఫ్లెక్సీ వివాదాలు ఎక్కువ అయిపోయాయి.. ఇంకా ఆంధ్రాలో అయితే మరి ఘోరం.. చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి ఏదో ఒక గోల ఉండనే ఉంటుంది.. ఈ నేపథ్యంలోనే కర్నూల్ జిల్లాలో మరోసారి ఫ్లెక్సీ వివాదం తెర మీదకు వచ్చింది. ఆ వివాదం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.. 

              

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ పార్టీకి చెందిన నాయకులు ఏర్పాటై చేసిన ఫ్లెక్సీపై ప్రస్తుతం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయం ఏంటి అంటే.. గుంతకల్లు ఎమ్మెల్యే వై. వెంకట రామిరెడ్డి శ్రీశైలం వెళ్తుండటంతో అక్కడ ఆయనకు వైసీపీ పార్టీ నేతలు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.           

 

ఆ ఫ్లెక్సీలే ప్రస్తుతం వివాదానికి తెర తీశాయి. ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ వేశారు.. అయితే అందులో వచ్చిన చిక్కు ఏంటి అంటే.. ఆ ఫ్లెక్సీలో శ్రీశైలం దేవస్థానం లోగోను కూడా ముద్రించారు. దీంతో అక్కడ కొందరు ప్రతిపక్ష నేతలు.. శ్రీశైలం భక్తులు వీటిని తప్పు పడుతున్నారు.. 

 

ఇప్పటికే రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలపై దేవస్థాన లోగోలను నిషేధించారు.. అయినప్పటికి వెయ్యడంతో ఇదే టైమ్ అనుకున్న కొందరు ప్రతిపక్ష నేతలు భక్తులతో కలిసి ఆందోళనకు దిగారు... అంతేకాదు నిబంధనలకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ వ్యవహరిస్తోంది అని.. దేవస్థాన యాజమాన్యం ఇలాంటి ఫ్లెక్సీల ఏర్పాటుపై వ్యతిరేకించాల్సింది పోయి పట్టించుకోకుండా ఉండటం ఏంటి అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. 

 

మరి ఈ ఫ్లెక్సీ కథ ఎం అవుతుందో తెలియదు కానీ.. గతంలోనూ ఇలా ఫ్లెక్సీ గొడవలు చాలానే జరిగాయి. అయినప్పటికీ ఇది రిపీట్ అయ్యింది. మరి ఈ వివాదం ఎంతకు దారితీస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: