ఆర్టికల్ 370 రద్దు తరువాతి పరిస్థితుల నేపథ్యంలో… జ‌మ్మూక‌శ్మీర్ విష‌యంలో  కేంద్రం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత కేంద్రం ఐదు నెలల పాటు అక్కడి ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించిందింది. జనవరి 25న ఆ సుదీర్ఘ నిషేధాన్ని ఎత్తేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.  అయితే, తాజాగా జమ్మూ లోయలో ఇంటర్నెట్ పై మళ్లీ కేంద్రం నిషేధం విధించింది. ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి తీసిన రోజు సందర్భంగా వేర్పాటువాదులు ఆదివారం బంద్‌కు పిలుపునివ్వడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఉదయం నుంచే ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. అయితే, అఫ్జల్ గురు మరణ శిక్ష విధించిన రోజున బంద్‌కు పిలుపునివ్వడంతో.. ఎలాంటి ఆందోళనలు చెలరేగకుండా ఇంటర్నెట్‌ను నిషేధించింది. అటు.. నిషేధిత సంస్థ జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

కాగా,. గ‌త ఆగ‌స్టులో ఆర్డిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో.. క‌శ్మీర్‌లో అనేక మంది నేత‌ల‌ను గృహ నిర్బంధం చేసిన విష‌యం తెలిసిందే.  జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎంలు మెహ‌బూబా ముఫ్తీ, ఒమ‌ర్ అబ్దుల్లాల‌పై ప్ర‌భుత్వం కేసు న‌మోదు చేసింది.  ఇద్ద‌రిపైనా ప‌బ్లిక్ సేఫ్టీ యాక్ట్ కేసుల‌ను బుక్ చేశారు.  వీరితో పాటు నేష‌న‌ల్ కాన్ప‌రెన్స్‌, పీపుల్స్ డెమోక్ర‌టిక్ పార్టీకి చెందిన కీల‌క నేత‌ల‌పైన కూడా కేసులు దాఖ‌లు వేసిన‌ట్లు తెలుస్తోంది. పోలీసుల‌తో క‌లిసి మెహ‌బూబా ముఫ్తీ ఇంటికి వెళ్లిన మెజిస్ట్రేట్.. పీఎస్ఏ నోటీసుల‌ను జారీ చేశారు.  సెక్ష‌న్ 107, 151 కింద ఇద్ద‌రు నేత‌ల‌పై కేసు బుక్ చేశారు.

 

 

మ‌రోవైపు.... కొద్ది నెలలుగా శ్రీనగర్‌లోని హరినివాస్‌లో గృహనిర్బంధంలో ఉన్న జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ప్రభుత్వ బంగ్లాకు తరలించారు. గుప్కార్ రోడ్డులోని ప్రభుత్వ బంగ్లా ఎం-4కు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో అధికారులు.. ఆయన్ను బంగ్లాకు తరలించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను కేంద్రం రద్దు చేసిన వెంటనే ఒమర్ అబ్దుల్లాను హరినివాస్‌లో నిర్బంధంలో ఉంచారు. అయితే మరో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రస్తుతం ఉన్న లొకేషన్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే, తాజాగా ఒమర్, మెహబూబా ముఫ్తీలపై కేసు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: