వైసిపి పార్టీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విశాఖపట్టణం ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడానికి తెలుగుదేశం పార్టీ భారీ కుట్రకు పాల్పడుతున్నారు అన్నట్టుగా కామెంట్ చేశారు. అప్పట్లో 2014 ఎన్నికల సమయంలో విశాఖపట్టణంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పోటీచేసిన సమయంలో దారుణమైన పుకార్లు సృష్టించారని అప్పుడు ప్రజలు అమాయకంగా నమ్మటం జరిగిందని కానీ ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలిసాయి అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఒక డ్రామా పార్టీ అని వాళ్లు చెప్పే అబద్ధాలని ఎవరు నమ్మడం లేదని అవంతి పేర్కొన్నారు. మీడియా సపోర్ట్ ఉంది కదా అంటూ తెలుగుదేశం పార్టీ ఇష్టానుసారం అయిన కథనాలు ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు.

 

విశాఖపట్టణం నుంచి విజయనగరం వైపు తెలుగుదేశం పార్టీ నేతలకు భూములు ఉన్నాయని...నిజంగా వైసీపీ పార్టీ నాయకులు భూదందా చేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీ భూములు మిగిలేవ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదేళ్లలో ఒక్క అవినీతి కూడా లేకుండా పాలన చేసి చూపిస్తామని ఆయన చెప్పారు. విజయసాయిరెడ్డి తనకు ఇక్కడ ఒక అపార్టుమెంట్ తప్ప బూములు ఏమీ లేవని చెప్పినా టిడిపి నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.గతంలో టిడిపి నేతల భూ దందాలపై ఎన్నో వార్తలు వచ్చాయని, వీరి దుశ్చర్యల వల్ల పలువురు ఎమ్.ఆర్.ఓ.లు సస్పెండ్ అయ్యారని ఆయన అన్నారు.

 

విశాఖ ఇప్పటికే అబివీద్ది చెందిందని, అన్ని వసతులు ఉన్నందునే కార్యనిర్వాహక రాజదాని పెడితే మరింత మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ భావించారని, దీనిని స్వాగతించాల్సింది పోయి,రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. తండ్రి వైయస్ మాదిరిగానే జగన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందాలని అన్ని ప్రాంతాలు బాగుపడాలని దాని కనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ అవంతి పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: