శాసనమండలి చరిత్రలో ఎన్నడూ జరగని షాకింగ్ ఘటనలు  జరిగిపోతున్నాయి. రెండు బిల్లుల విషయంలో మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ తీసుకున్న ఓ నిర్ణయం తర్వాత ఘటనలు  మండలిని పట్టి కుదిపేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఛైర్మన్ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేయటం గమనార్హం. నిజానికి లేని అధికారాలను ఛైర్మన్ తన చేతిలోకి తీసుకుని బిల్లులను సెలక్ట్ కమిటి పరిశీలనకు పంపుతున్నట్లు ఛైర్మన్ ప్రకటించేశారు.  అప్పటి నుండి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మండలి ఛైర్మన్ కు ప్రభుత్వానికి మధ్య పెద్ద వివాదమే నడుస్తోంది.

 

తాజాగా రెండు  సెలక్ట్ కమిటిలను నియమించిన ఛైర్మన్ తనంతట తానుగానే సభ్యులను నియమించేశారు. మామూలుగా అయితే సెలక్ట్ కమిటి ఏర్పాటు తర్వాత సభ్యులను ప్రతిపాదించాలని  ఉన్నతాధికారులు పార్టీలకు లేఖలు రాస్తారు. కానీ ఛైర్మన్ నియమ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి  ఉన్నతాధికారులు ఏ పార్టీకి లేఖలు రాయలేదు. దాంతో ఛైర్మనే చొరవ తీసుకుని లేఖలు రాసేశారు. పార్టీలు కూడా సభ్యులను ప్రతిపాదిస్తు సభ్యుల పేర్లను అందించాయి.

 

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఛైర్మనే తనంతట తానుగా కమిటిల్లో వైసిపి సభ్యులను కూడా మెంబర్లుగా వేసేశారు. అసలు ఛైర్మన్ నుండి వైసిపికి ఎటువంటి లేఖ రాలేదు. కాబట్టి వైసిపి సభ్యులను ప్రతిపాదించే ప్రస్తావనే ఉత్పన్నం కాలేదు. కమిటిల విషయం, సభ్యులను ప్రతిపాదించే విషయాల్లో ఛైర్మన్ కు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. అదేమిటంటే నియమ, నిబంధనలకు విరుద్ధంగా అంటే చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్న ఛైర్మన్ ఆదేశాలను పట్టించుకోవద్దంటూ అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

ఛైర్మన్ దగ్గర నుండి వచ్చే ఎటువంటి ఆదేశాలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వంలోని ముఖ్యులు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. సహజంగానే ఛైర్మన్ కు వ్యతిరేకంగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి, అసెంబ్లీ స్పీకర్, మండలిలో వైసిపి సభాపక్ష నేత, మండలిలో వైసిపి విప్ అంతా ఏకమయ్యారు. దాంతో ఇంతకాలం నివురుగప్పిన నిప్పులాగున్న వివాదం ఎప్పుడు బద్దలవుతుందో అన్న టెన్షన్ పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: