తాను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తన మాటే నెగ్గాలనే మనస్తత్వంతో చంద్రబాబునాయుడు ఏకంగా వ్యవస్ధలనే నాశనం చేసేస్తున్నాడు. మొన్నటి ఎన్నికల్లో జనాలు మాడుపగులగొట్టారన్న కసి చంద్రబాబు ఆలోచనల్లో కనబడిపోతోంది. అందుకనే    జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎంత వీలుంటే అంత  బురద చల్లాలన్న ప్రయత్నంలో ఏకంగా వ్యవస్ధలనే భ్రష్టుపట్టించేస్తున్నారు. జగన్ పై కసితోనే చంద్రబాబు ఇదంతా చేస్తున్నట్లు అర్ధమైపోతోంది.  శాసనమండలి వ్యవహారంలో తెరవెనుక నుండి చంద్రబాబు ఆడుతున్న డ్రామాలే ఇందుకు తాజా ఉదాహరణ.

 

మొన్నటి ఎన్నికల్లో జనాలు కొట్టిన దెబ్బకు చంద్రబాబుకు మైండ్ బ్లాంక్ అయ్యిందన్నది వాస్తవం. దానికితోడు అసెంబ్లీలో చంద్రబాబును అధికార పార్టీ నోరెత్తనీయటం లేదు.   వాస్తవ పరిస్ధితులను మరచిపోయి తన మాటే నెగ్గాలన్న ఆలోచనలతో చంద్రబాబు పంతానికి పోయి అసెంబ్లీలో తలబొప్పి కట్టించుంటున్నారు.  దాంతో జగన్ పై చంద్రబాబులో రోజురోజుకు ఉక్రోషం పెరగిపోతోంది. అసెంబ్లీలో నోరెత్తలేకపోతున్న చంద్రబాబు శాసనమండలిలో టిడిపికున్న మెజారిటిని అడ్డం పెట్టుకోవాలని అనుకున్నారు. ఇంగ్లీషు మీడియం, ఎస్సీ, ఎస్టీ కమీషన్ల ఏర్పాటు బిల్లులకు అసెంబ్లీలో మద్దతిచ్చి మండలిలో అడ్డుకోవటమే  నిదర్శనం.

 

అసెంబ్లీలో పాసైన పరిపాలనా వికేంద్రీకరణ చట్టం-20202, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను శాసనమండలిలో అడ్డుకున్నారు. అసెంబ్లీలో పాసైన ప్రతి బిల్లు మండలిలో పాసవ్వాలని లేదు. మండలిలో  పెట్టిన బిల్లులను సభ్యులు  ఆమోదించవచ్చు,  ఓడగొట్టవచ్చు అది కాదంటే సవరణలూ ప్రతిపాదించవచ్చు. కానీ ఇవేవి కాకుండా నిబంధనలకు విరుద్ధంగా సెలక్ట్ కమిటి పరిశీలనకు పంపుతు ఛైర్మన్ తో ప్రకటింపచేయటమంటే  శాడిజం క్రిందకే వస్తుంది.

 

మెజారిటి ఉందన్న ఏకైక కారణంతో ఛైర్మన్ ను తెరవెనుక నుండి చంద్రబాబు నడిపిస్తున్నారు. విచక్షణాధికారాల పేరుతో నిబంధనలను ఉల్లంఘించేట్లుగా ఒత్తిడి పెట్టి మరీ మండలిని గబ్బు పట్టిస్తున్నారు. తన శాడిజంతో చంద్రబాబు దుష్టసంప్రదాయాలకు తెరతీశారనే చెప్పాలి. సరే రేపు మండలి ఉంటుందా ? ఊడుతుందా ? అన్నది అప్రస్తుతం. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు గెలుపోటములను హుందాగా తీసుకుకోండా శాడిజంతో వ్యవహరించటమే ఆశ్చర్యంగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: