అధికారపార్టీ అండ చూసుకుని పరిధి దాటి  ప్రత్యర్ధులపై రెచ్చిపోతే పర్యవసానాలు ఇలాగే ఉంటాయా ? అవుననే సమాధానం వస్తోంది ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు వ్యవహారం చూసిన తర్వాత.  చంద్రబాబునాయుడు హయాంలో ఏబి వెంకటేశ్వరరావు ఏ స్ధాయిలో వెలిగిపోయాడో అందరికీ తెలిసిందే. ఇద్దరి సామాజికవర్గం ఒకటే అవ్వటంతో పాటు ఏబి కూడా తానొక ఐపిఎస్ అధికారిని అన్న విషయాన్ని మరచిపోయాడు.

 

ఐపిఎస్ అధికారి కాస్త చంద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా మారిపోయాడు. దాంతో ప్రభుత్వానికి పార్టీ వ్యవహారాలకు తేడా లేకుండా పోయింది. ఇంకేముంది పార్టీ నేతలు చూసుకోవాల్సిన వ్యవహారాలు కూడా ఏబి చక్కబెట్టటం మొదలుపెట్టేశారు. వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు టిడిపిలోకి ఫిరాయించటంలో ఏబిదే ప్రధానపాత్రగా వైసిపి నేతలు ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే.  అంతే కాకుండా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి  కొందరు ఎంఎల్ఏల కదలికలపై ఇంటెలిజెన్స్ అధికారులతో షాడో టీములను ఏర్పాటు చేశారు.

 

అనధికారికంగానే వైసిపి ఎంఎల్ఏలు, నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు  చంద్రబాబు-ఏబి ధ్వయంపై వైసిపి చాలా ఆరోపణలే చేసింది. వైసిపి ఎంఎల్ఏల ఫిరాయింపుల విషయంలో డబ్బు, కాంట్రాక్టులు, పదవులు అన్నింటినీ ఏబినే డిసైడ్ చేసేవారనే ఆరోపణలకు కొదవేలేదు.

 

అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏబి వృత్తిధర్మాన్ని మరచిపోయాడున్నది వాస్తవం. చంద్రబాబుకు ఏబి ఎందుకు అత్యంత సన్నిహితునిగా మారిపోయారంటే అందుకు కారణం ఉంది. అదేమిటంటే ఎప్పటికీ చంద్రబాబే అధికారంలో ఉంటాడని చాలామందితో పాటు ఏబి కూడా అనుకున్నారు. దాని పర్యవసానమే అన్నీ హద్దులు దాటిపోవటం.

 

ఒక అధికారిగా ఏమేమి చేయకూడదో అన్నీ చేశారు ఏబి. దాంతో వైసిపి ప్రభుత్వానికి టార్గెట్ గా మారిపోయారు. దాని ఫలితమే ఇపుడు సస్పెన్స్ వేటు. ఏబి మాత్రమే కాకుండా సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర, ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ లాంటి వాళ్ళు ఇంకా చాలామందున్నారు. చూద్దాం ఎవరెవరు బయటకు వస్తారో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: