ఫ్రీగా వచ్చిందంటే ఫినాయిల్ కూడా వదిలి పెట్టారు జనాలు. ఉచితం అనే మాట వినపడితే చాలు ప్రాంతంతో సంబంధం లేకుండా ఎగబడిపోతారు. అయితే, యూకేకు చెందిన ఓ జంట.. బారులో ఉచితంగా మందుకొట్టి డబ్బులు సేవ్ చేయాలని భావించారు. అయితే, బారులో ఉచితంగా మద్యం ఇవ్వరు కాబట్టి, అక్కడికి వచ్చే కస్టమర్లకు టోపీ వేసి మద్యం తాగాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆ జంట ఏం చేశారో చూడండి.

 

కొరిన్నె మిల్లర్, ఆడమ్ క్యార్రాల్ అనే జంట దాదాపు ఒక నెల నుంచి సహజీవనం చేస్తున్నారు. ఇటీవల ఇద్దరూ అట్లాంటా వెళ్లారు. ఆ టూర్‌లో డబ్బులు పొదుపుగా వాడాలని నిర్ణయించుకున్నారు. అట్లాంటా తదితర పాశ్చాత్య దేశాల్లో హోటల్ లేదా బార్లలో ఎవరైనా ప్రపోజ్ లేదా ఎంగేజ్మెంట్ చేసుకుంటే కస్టమర్లు వారితో కలిసి మందు కొడతారు. ఈ నేపథ్యంలో మిల్లర్, క్యార్రాల్‌లు పెళ్లి ప్రపోజల్ డ్రామాకు తెరతీశారు.

 

ఈ సందర్భంగా మిల్లర్ రింగు చూపిస్తూ క్యార్రాల్‌కు ప్రపోజ్ చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. ఇందుకు క్యార్రాల్ సర్‌ప్రైజ్ అయినట్లు నటిస్తూ.. అతడి యస్ చెప్పింది. ఇదంతా చూసిన కస్టమర్లు అతడు నిజంగానే ప్రపోజ్ చేస్తున్నాడని భావించారు. ఆనందాన్ని తమతో పంచుకోవాలని కోరుతూ ఆ జంటకు ఉచితంగా మద్యం అందించారు.

 

రెండో సారి వేరే బారుకు వెళ్లారు. అక్కడ కూడా అదే డ్రామాతో కస్టమర్ల ఆర్డరు చేసి మద్యాన్ని పీకలు దాకా తాగారు. టూర్ ముగించుకుని ఇంటికి చేరుకున్న తర్వాత ఆ జంట ఈ ఫన్నీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 

 

మిల్లర్ ఈసారి క్యార్రాల్‌కు నిజంగానే ప్రపోజ్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకోవాలని భావించాడు. తన పుట్టిన రోజున కొంతమంది మిత్రులను, బంధువులను బారుకు ఆహ్వానించాడు. మిల్లర్ మొకాలిపై కుర్చొని క్యార్రాల్‌కు ఎంగేజ్మెంట్ రింగు చూపిస్తూ.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా’’ అని అడిగాడు. అతడు ఫ్రీగా మందుకొట్టేందుకు ఈ డ్రామా అడుతున్నాడని భావించి ఆమె ఒకే చెప్పింది. చివరికి తాను నిజంగానే ప్రపోజ్ చేశాన్నారు. ఇదేదో చిన్నప్పుడు విన్న ‘అదిగో పులి’ కథలా ఉంది కదూ!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: