ఇటీవల వరుస పెట్టి ఐటీ దాడులు దక్షిణ భారతదేశంలో ప్రముఖ రాజకీయ నాయకుల ఇళ్ల పై మరియు సినిమా హీరోలపై జరుగుతున్నాయి. మొదటిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ లపై తర్వాత టాలీవుడ్ హీరోయిన్లపై దాడులు సోదాలు జరిగాయి. కాగా ఇటీవల తమిళ ఇండస్ట్రీ స్టార్ హీరో విజయ్ కి సంబంధించిన ఇళ్లపై కార్యాలయాలపై ఐటీ అధికారులు భారీ ఎత్తున సోదాలు చేయడం జరిగింది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస చౌదరి కి సంబంధించిన ఇళ్లపై ఒక్కసారిగా ఐటి దాడులు సోదాలు చేయడం జరిగింది. ఇంకా సోదాలు జరుగుతున్న క్రమంలో టీడీపీ నేతలు భయపడుతున్నట్లు సమాచారం.

 

నాలుగో రోజు చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడు ఇంటిలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు  నిర్వహించడం తో ఈ విషయం ఎప్పుడూ ఏపీ రాజకీయాల పెద్ద హాట్ టాపిక్ అయింది. రహస్య లాకర్‌ నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అవి ఇంకా నిర్దారణ కావల్సి ఉంది..ఒక కంపెనీ నుంచి 150 కోట్ల నిదులు వచ్చాయన్న ఆరోపణలపై ఈ విచారణ సాగుతోందని అంటున్నారు. మరో వైపు మాజీ మంత్రి లోకేశ్‌ సన్నిహితులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్‌కు చెందిన అవెక్సా కార్పొరేషన్‌, కిలారు రాజేష్‌ ఇళ్లల్లో ఐటీ అధికారుల సోదాలు జరిగాయి.

 

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఇద్దరూ రూ.కోట్లలో లబ్ధి పొందినట్టు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. అయితే ఇది కేంద్రం మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో చంద్రబాబు ని ఇరికించే విధంగా దాడులు జరుగుతున్నట్లు తెలుగుదేశం పార్టీలో ఓ వర్గపు నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఏ మాత్రం విషయం తేడా పడితే తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబు రాజకీయంగా క్లోజ్ అయ్యే పరిస్థితి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: