గన్ మిస్‌ అవడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఓ రిటైర్డ్‌ సీఐ చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో.. పోలీస్‌ స్టేషన్ నుంచి పోయిన రెండు తుపాకుల్లో ఒకటి కనిపెట్టగా.. రెండో దాని ఆచూకీ కోసం సెర్చింగ్‌ సాగుతోంది. 

 

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన కాల్పుల్లో ఆశ్చర్యకర విషయాలు బయటపడుతున్నాయి. గతంలో గన్‌ మిస్ అయిన కేసులో సీఐ భూమయ్యపై చర్యలు తీసుకుంది పోలీసు శాఖ. దీంతో అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భూమయ్య ప్రెస్ మీట్ పెట్టి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై నిర్లక్ష్యం వల్ల తుపాకులు పోతే.. అత్యుత్సాహంతో తనను వేదింపులకు గురిచేశారని ఆరోపించారాయన. డిపార్ట్‌మెంట్‌లో రిటైర్డ్‌ ఉద్యోగుల పెత్తనం ఎక్కువైందని.. అందుకే రెండు తుపాకులు పోయిన మూడేళ్ల నుంచి పట్టించుకోలేదన్నారు సీఐ భూమయ్య.

 

2017 జనవరిలో హుస్నాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏకే-47, కార్బైన్‌ తుపాకులు కనిపించకుండా పోయాయి. అప్పటికే స్టేషన్‌ నుంచి సీఐగా బదిలీ అయిన భూమయ్యకు రెండు నెలల తర్వాత నోటీసులు ఇచ్చింది పోలీసు శాఖ. అయితే, తుపాకులు తాజాగా గతంలో పోలీస్‌ స్టేషన్ కు తరచూ వచ్చిన సదానందం అనే వ్యక్తి వద్ద లభ్యమయ్యాయి. ఏకే 47, దానిని భద్రపరిచే బెల్టు, కార్భన్‌ గన్‌ అతను ఎలా దొంగిలించాడనే కోణంలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు భూమయ్య. ఇంటి దొంగల సహకారం లేనిదే ఆయుధగారంలోకి వెళ్లలేరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

 

మూడేళ్ల క్రితమే రెండు ఆయుధాలు మాయమైనా.. ఉన్నతాధికారులకు తెలియకుండా గోప్యత పాటించారు పోలీసులు. రికార్డుల్లో అవి ఉన్నట్టుగానే నమోదు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆ తుపాకీ దొరకడంతో తప్పుడు రికార్డులు నమోదు చేసిన పోలీసులు నిందితులుగా మారే పరిస్థితి ఏర్పడింది. పోలీస్‌ స్టేషన్ నుంచి పోయిన రెండు తుపాకుల్లో ఒకటి కనిపెట్టగా.. రెండో దాని ఆచూకీ కోసం సెర్చింగ్‌ సాగుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: