రెండు కీల‌క అంశాల విష‌యంలో గుడ్ న్యూస్‌లు. రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ఇంధన ధరలు క్రమంగా శాంతిస్తున్నాయి. అంతర్జాతీ య మార్కెట్లో క్రూ డాయిల్‌ ధరలు దిగిరావడంతోపాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలోపేతం కావడంతో దేశీయంగా ధరలను తగ్గిస్తున్నాయి.వరుసగా పది రోజులుగా ధరలు తగ్గిస్తున్న ఇంధన విక్రయ సంస్థలు శనివారం మరో అడుగుముందుకేసి ఏకంగా 27 పైసల వరకు కోత విధించాయి ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు. మ‌రోవైపు...ఈ ఏడాది గడచిన ప్రథమార్థంలో మనదేశంలో జరిగిన నియామకాలు, ఉద్యోగులకు కల్పిస్తున్న జీతభత్యాలు, సదుపాయాలపై 55 శాతం యాజమాన్యాలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 

 


గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌ ధర రూపాయి వరకు తగ్గగా, డీజిల్‌ కూడా ఇంతే స్థాయిలో ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు చౌక అయింది. అంతర్జాతీయ రేట్లు, డాలర్‌-రుపీ ఎక్స్చేంజ్‌ ఆధారంగా రోజువారి ధరలను మారుస్తున్నాయి. గ‌త మూడు నెలల్లో ఒకే రోజులో ఇంతటి స్థాయిలో ధరలు తగ్గించడం ఇదే తొలిసారి. పెట్రోల్‌ ధరలను 23 పైసల నుంచి 24 పైసల వరకు తగ్గించిన సంస్థలు..డీజిల్‌పై 25 పైసల నుంచి 27 పైసల వరకు తగ్గించాయి. ఇంధన విక్రయ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ఢిల్లీలో పెట్రోల్‌ ధర 23 పైసలు తగ్గి రూ. 72.45కి దిగిరాగా, డీజిల్‌ ధర 25 పైసలు తగ్గి రూ. 65.43కి చేరుకుంది.  ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.78.34 నుంచి రూ.78.11కి తగ్గ గా, డీజిల్‌ రూ.68.84 నుంచి రూ.68.57కి దిగొచ్చింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర 25 పైసలు తగ్గి రూ.77.08కి చేరుకోగా, అలాగే డీజిల్‌ ధర 28 పైసలు తగ్గి రూ.71.35గా నమోదైంది. ఆయా నగరాల్లో విధిస్తున్న పన్నుల ఆధారంగా ధరలు మరింత తగ్గనున్నాయి. 

 

ఇదిలాఉండ‌గా, దేశవ్యాప్తంగా సుమారు 2,400 నియామకాల్లో పాలుపంచుకున్న యాజమాన్యాలపై జరిగిన అధ్యయనంను హైరింగ్ ఔట్‌లుక్ 2020 పేరుతో విడుద‌ల చేశారు. అధిక శాతం ఉద్యోగులకు కల్పిస్తున్న జీతభత్యాలు, సదుపాయాలపై సంతృప్తి వ్యక్తమైంది. దాదాపు 26 శాతం మంది కొత్త ఉద్యోగ నియామకాల వైపే మొగ్గుచూపగా, 13 శాతం మంది మరొకరి స్థానంలో నియమించుకునేందుకే ఇష్టపడ్డారని నివేదిక వివరించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: