సరోగసి బిల్లుకు రాజ్యసభ సెలక్ట్ కమిటీ చేసిన సవరణలతో దేశంలో అద్దె గర్భాలు మరింత కమర్షియల్ కానున్నాయి. పేద మహిళలే టార్గెట్‌గా థర్డ్ పార్టీలు పని చేస్తాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు గుట్టు చప్పుడు కాకుండా సాగిన సరోగసి బిజినెస్ ఇప్పుడు బహిరంగంగానే సాగనున్నాయి. ఆర్ధిక అవసరాలు అమ్మ తనాన్ని అద్దెకు ఇమ్మని ప్రోత్సహించే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తోంది. కమిటీ చెప్పిన సవరణలతో అమ్మతనం ఇప్పుడు అంగడి సరుకు అవుతుందన్న విమర్శలున్నాయి.

 

పేదింటి మహిళల గర్భాలకు వెలకడుతున్న వికృత ధోరణిపై కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు తీసుకువస్తోంది. బీజేపీ సర్కార్ సరికొత్త సరోగసి చట్టం తీసుకురానుంది. నైతిక విలువలకు పాతరేస్తూ మన దేశంలోనూ వేలంవెర్రిగా తయారైన సరోగసి ప్రక్రియని రెడ్ కార్పెట్ పరిచి మరి ఆహ్వానించబోతుంది. నవ మాసాలు మోసి, ప్రసవవేదన భరించి ఓ పసిగుడ్డుకి జన్మనిచ్చేది మాతృత్వపు మమకారంతో కాదు. కాసులిచ్చేందుకు సిద్ధపడిన ఇతరుల కోసమే. నైతిక విలువలకే సవాలుగా మారిన సరోగసీపై కమిటి సవరణలు తీసుకువచ్చింది. అద్దె గర్భం సంస్కృతికి తలుపులు బార్లా తెరిచింది. సరోగసి ద్వారా పిల్లల్ని సొంతం చేసుకునే ప్రక్రియని సరికొత్తగా రాబోతున్న చట్టం మరింత ఈజీ చేసేలా కనిపిస్తుంది. సరోగసి బిల్లుకు సవరణలు చేస్తూ సెలెక్ట్ కమిటీకి పంపించారు.

 

అయితే... సహజీవనం చేసే జంటలు, సింగిల్‌ పేరెంట్స్, స్వలింగ  సంపర్కులు అద్దె గర్భం ప్రక్రియలో అడ్డదారులు తొక్కకుండా కట్టుదిట్టమైన నిబంధనల్ని ప్రతిపాదిస్తోంది సరోగసి 2016 చట్టం. ఇప్పడు భూపేంద్ర యాదవ్ కమిటీ సవరణలతో మరీ ముఖ్యంగా విదేశీయులు, ప్రవాస భారతీయులు, భారతీయ మూలాలున్న విదేశీయులు సరోగసీ విధానంలో బిడ్డల్ని పొందడం ఈజీ అవుతుంది. దేశంలో అద్దెగర్భం ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు, అనైతిక కార్యకలాపాల్ని గమనించిన కేంద్రం 2016 కొత్త చట్టంలో కఠిన నిబంధనలను పొందుపరిచింది. సరోగసి చట్టం నిబంధనల్ని ఉల్లంఘించినవారికి పది లక్షల జరిమానా, పదేళ్ల దాకా జైలు శిక్ష విధిస్తారు. సరోగసికి సిద్ధపడేవారికి ఉండాల్సిన అర్హతలు, ఈ ప్రక్రియలో ఉన్న పరిమితులు, చట్టబద్ధతకు సంబంధించి సరోగసి యాక్ట్‌లోఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది కేంద్రం. పెళ్లయి ఐదేళ్లు గడిచినా పిల్లలు కలగని దంపతులు మాత్రమే అద్దెగర్భం ప్రక్రియను వినియోగించుకునే అవకాశముంది. అది కూడా సన్నిహిత బంధువుల ద్వారా మాత్రమే ఈ  విధానంలో పిల్లల్ని పొందాల్సి ఉంటుంది.

 

ఇక...ఇప్పుడు సరోగసి బిల్లులో తీసుకొచ్చిన సవరణలు అమలు అయితే ఎవరైనా సరోగసి చేయించుకోవచ్చు. నా శరీరం నా ఇష్టం అనుకోనేలా ఉన్నాయి కొత్తగా వచ్చిన సవరణలు. ఇది దళారులకు కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంది. పేద మహిళల ఆర్దిక పరిస్దితిని క్యాష్ చేసుకొనేందుకు ప్రోత్సహించేదిగా కొత్త సరోగసి చట్టం ఉండబోతుందన్న విమర్శలు ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: