ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న సాయంత్రం 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏబీ వెంకటేశ్వరరావు గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్ గా విజయవాడలో రౌడీయిజాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించి మంచి పేరును సంపాదించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. 
 
చంద్రబాబు హయాంలో కీలక హోదాలో ఉన్న వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఏపీ రాజకీయ వర్గాల్లో, పోలీస్ వర్గాల్లో ఏబీ వెంకటేశ్వరరావు గురించి మూడు ఆరోపణలు ప్రచారం జరుగుతున్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 23 మంది ఎమ్మెల్యేల విషయంలో బేరసారాలు ఆడాడని ఒక ఆరోపణ. 
 
తెలగుదేశం పార్టీని గెలిపించడానికి కూడా ఏబీ వెంకటేశ్వరరావు ఎత్తులు వేశారని మరో ఆరోపణ. కానీ ఏబీ వెంకటేశ్వరావు సన్నిహితులు మాత్రం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నవారు ఖచ్చితంగా సమాచారం అందించాల్సిందేనని చెబుతున్నారు, కానీ వాస్తవంగా ప్రభుత్వం ఇజ్రయెల్ కంపెనీ నుండి పరికరాలను కొనుగోలు చేశారని అలా చేయటం వలన దేశ భద్రతకు రాష్ట్ర భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఆరోపణలతో సస్పెండ్ చేసింది. 
 
ఏబీ వెంకటేశ్వరరావు కొడుకుకు సంబంధించిన సంస్థ కోసం వస్తువులను కొనుగోలు చేశారని అందువలనే సస్పెండ్ చేశామని ప్రభుత్వం నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు మాత్రం అందరికీ వింతగా అనిపిస్తున్నాయి. ఏబీ వెంటేశ్వరరావు జగన్ ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన భూమిక పోషించారని ఇలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో పావుగా మారి ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వలన రిటైర్మెంట్ సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇబ్బందులు పడుతున్నాడని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: