తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జిల్లాల్లో ఉండే జాయింట్ కలెక్టర్ల స్థానాన్ని రద్దు చేశారు. సీఎం కేసీఆర్ పాలన సంస్కరణల్లో భాగంగా కీలక మార్పులను చేశారు. జిల్లా స్థాయిలో రెవెన్యూ చట్టం అమలును, భూ వ్యవహారాలను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ పోస్టును రద్దు చేసేలా టీఆర్ ఎస్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 
 
ప్రభుత్వం రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ల స్థానంలో అదనపు కలెక్టర్లను నియమించింది. చాలా జిల్లాలలో జాయింట్ కలెక్టర్లు అదే జిల్లాకు అదనపు కలెక్టర్లుగా బదిలీ అయ్యారు. ప్రభుత్వం 14 జిల్లాలకు వేరే అధికారులను అదనపు కలెక్టర్లుగా నియమించగా కొన్ని జిల్లాలకు మాత్రం కొత్త అధికారులను అదనపు అధికారులుగా నియమించింది. నిన్న అర్ధరాత్రి సమయంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 49 మంది నాన్ కేడర్, కేడర్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
 
గతంలోనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పాలనాపరమైన సంస్కరణలు చేయబోతున్నట్టు ప్రకటన చేశారు. తాజాగా కేసీఆర్ ఆదేశాల మేరకు పరిపాలనాపరమైన సంస్కరణలు జరిగాయి. సీఎం కేసీఆర్ తెలంగాణ స్టేట్ అడ్మినిస్టేటివ్ సర్వీస్ ను నెలకొల్పి పాలనా సంస్కరణలను తీసుకొనిరావాలని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవిన్యూ చట్టం కోసం రూపకల్పన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం అదనపు కలెక్టర్ల ద్వారా జిల్లా స్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థ ఏర్పాటు చేయడం కొరకు సిద్ధమవుతోంది. 
 
 అదనపు కలెక్టర్ల నియామకం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేలా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందేలా, అవినీతికి, ఆలసత్వానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం అదనపు కలెక్టర్లకు బాధ్యతలను అప్పగించనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలలో, గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో అవినీతి జరగకూడదనే ప్రభుత్వం అదనపు కలెక్టర్లను నియమించి ఒక్కో అదనపు కలెక్టర్ కు కొన్ని కీలక బాధ్యతలను అప్పగించనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: