చైనా కరోనా వైరస్ కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధిని కంట్రోల్ చేసేందుకు చైనా చేయని ప్రయత్నాలు లేవు. తన పౌరులపై అనేక ఆంక్షలు విధించింది. వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జనవరి 23న చైనా తన సరిహద్దుల నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించింది. అయితే కరోనాకు సంబంధించిన తాజా వార్త చైనా పాలకులకు నిద్ర పట్టకుండా చేస్తోంది.

 

 

ఆ వార్త ఏంటంటే.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న వుహాన్‌ నుంచి జనవరి 23కు ముందే.. దాదాపు 50 లక్షల మంది జనం బయటికి వెళ్లారట. వారంతా వుహాన్ నుంచి చైనాలోని పలు ప్రాంతాలకు వెళ్లి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వారి కారణంగా చైనాలోని ఇతర ప్రాంతాలకూ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది.

 

 

అందుకే వారిని గుర్తించేందుకు చైనాలోని గూగుల్ తరహా సెర్చింజన్ సంస్థ బైదు ప్రయత్నిస్తోంది. లొకేషన్‌ ఆధారంగా జనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

 

 

రెండు వారాల్లో దాదాపు 70శాతం మంది ఇక్కడ నుంచి బయటికి వెళ్లారట. వీరిలో14శాతం చుట్టుపక్కల ఉన్న హెనాన్‌, హునాన్‌, అన్హుయి, జియాంగ్సి ప్రాంతాలకు వెళ్లారని బైదు అంచనా వేస్తోంది. చైనాలోని ట్రావెల్స్‌ సంస్థల నుంచి 120 బిలియన్లకు పైగా ప్రయాణికుల వివరాలు బైదు సేకరించింది.

 

 

ఇప్పటికే కరోనా వైరస్‌ చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 800మందికి పైగా మృత్యువాత పడ్డారు. దాదాపు 40వేల మంది ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డారు. అయితే ఇవన్నీ అధికారికంగా చెబుతున్న లెక్కలు మాత్రమే. వాస్తవ పరిస్థితి ఇంకా ఎక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: