జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లటమే ధ్యేయంగా ఎల్లోమీడియా పావులు కదుపుతున్న విషయం తెలిసిపోతోంది. తాజాగా ఎకనామిక్ టైమ్స్ లో జగన్ కు వ్యతిరేకంగా వచ్చిన కథనంలో అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా ఎన్ని కథనాలు ఇచ్చినా జనాలు నమ్మటం లేదన్న కారణంగానే తాజాగా జాతి మీడియాను రంగంలోకి దింపినట్లు అర్ధమవుతోంది. అయితే జాతిమీడియాలో వచ్చిన కథనాలను కూడా జనాలు పట్టించుకోకపోవటంతో చివరకు అంతర్జాతీయ మీడియాను రంగంలోకి దింపారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

ఎకనామిక్ టైమ్స్ కథనంలో  జగన్ కు వ్యతిరేకంగా ’రివర్స్ స్వింగ్’ పేరుతో ఇష్టం వచ్చినట్లు రాశారు. ఆ కథనాన్ని పట్టుకుని ఎల్లోమీడియా ఊదరగొట్టేస్తోంది. అందులోని కొన్ని అంశాలను చూద్దాం.  విద్యుత్ రంగంలో పిపిఏల సమీక్ష తప్పట. కానీ సొంత మనుషుల కంపెనీలకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను అప్పనంగా కట్టబెట్టటం తప్పుకాదట. నవయుగ కంపెనీకి పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టును రద్దు చేయటం ఈ మ్యాగజైన్ తప్పు పడుతోంది. మరి నామినేషన్ మీద రూ. 3217 కోట్ల పనులను కట్టబెట్టేయటం తప్పుగా కనిపించలేదు.

 

నెల్లూరు జిల్లాలో సెజ్ కోసం నవయుగ కంపెనీకి కేటాయించిన 4731 ఎకరాలను రద్దు చేయటంపై కథనంలో మండిపడింది. మరి ఏ ఉద్దేశ్యంతో అయితే కంపెనీ భూములు తీసుకున్నదో దానిని నెరవేర్చకుండా బ్యాంకుల్లో కుదవపెట్టి వందల కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవటం తప్పుగా కనిపించలేదు మ్యాగజైన్ కు.  ఇక విశాఖపట్నంలో లులూ గ్రూపుకిచ్చిన 11 ఎకరాల రద్దును కూడా ప్రస్తావించింది. నిర్మాణాల కోసం లులూ గ్రూపు తీసుకున్న భూమిని 3 ఏళ్ళు దాటిని ఎందుకు ఖాళీగానే ఉంచింది ? అంటే చంద్రబాబునాయుడే మళ్ళీ అధికారంలోకి వస్తాడన్న నమ్మకంతోనే కదా ? రెండోసారి సిఎం అయితే ఏదో పద్దతిలో అమ్ముకోవచ్చనే ఖాళీగా ఉంచింది. అందుకే జగన్ రద్దు చేశాడు.

 

ఇక అమరావతి కన్సార్షియం నుండి సింగపూర్ కంపెనీలే వెనక్కు తగ్గాయి. సింగపూర్  కన్సార్షియం వల్ల ప్రభుత్వానికి ఏరకంగా లబ్దిజరుగుతుందో చెప్పమని లెక్కలడిగినందుకే సింగపూర్ కంపెనీలు స్టార్టప్ ప్రాజెక్టు నుండి వెనక్కు తగ్గాయి. కథనంలోని అంశాలను చూస్తుంటే ఎల్లోమీడియానో లేకపోతే  చంద్రబాబో వాళ్ళకిచ్చి ఏకపక్షంగా కథనం రాయించినట్లే అనుమానంగా ఉంది. అంటే ఓ పద్దతి ప్రకారం జగన్ పై బురద చల్లే కార్యక్రమం జరుగుతోందని తెలిసిపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: