ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ ఆదివారం చె(కొ)త్తపలుకును చదివిన వారికి ఎవరికైనా ఇదే అనుమానం రావటం ఖాయం. ఎందుకంటే ఎల్లోమీడియాగా ముద్రపడిన ఏబిఎన్-ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు జగన్మోహన్ రెడ్డికి మధ్య సంబంధాలు ఎలాగున్నాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ ప్రభుత్వంపై బురద చల్లటానికి టిడిపి నేతలకన్నా వేమూరి వారే ఎక్కువ కష్టపడుతున్నారు. అలాంటి ఆర్కెతో జగన్ మంత్రివర్గంలో ఎవరైనా మాట్లాడటానికి సాహసం చేస్తారా ? కానీ చెత్తపలుకులో మాత్రం జగన్ గురించి కొందరు మంత్రులు  కామెంట్లు చేశారని రాసుకొచ్చారు.

 

ఇటువంటి చెత్తపలుకులో  మంత్రులు, ఎంఎల్ఏలు చేసిన వ్యాఖ్యలని ఆయన చెప్పారు లేండి. ఇంతకీ ఆ వ్యాఖ్యలేమిటంటే ’అయినా ప్రజలు కూడా ఒకే పార్టీకి 151 మంది ఎంఎల్ఏలను గెలిపించి ఇవ్వకూడదు...ఇంత మందబలం ఉన్నపుడు పరిస్ధితి ఇలాగే ఉంటుంది’ అని అన్నారట. మంత్రిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి 151 మంది ఎంఎల్ఏలను గెలిపించటం తప్పని చెప్పిన మంత్రెవరో ?

 

కాంగ్రెస్ హయాంలో  మంత్రిగా పనిచేసిన  ఓ నేత మాట్లాడుతూ ’మా ముఖ్యమంత్రి ఎవరి మాట వినరు కాబట్టి నోటికి తాళాలు వేసుకుని కూర్చున్నాం...ముణిగిపోతే అందరమూ ముణుగుతాంలే అని గమ్మున ఉంటున్నాం’ అని తెగ బాధపడిపోయారట. ’ముఖ్యమంత్రి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది’ అని ఇంకో మంత్రి ప్రైవేటు సంభాషణలో చెప్పాడట.

 

’శాసనసభ్యుల సంగతి దేముడెరుగు.. అసలు మంత్రులకే సిఎం అపాయిట్మెంట్ దక్కటం లేదు..మేం ఎవరిని ఏ రేంజిలో తిట్టాలో స్క్రిప్ట్ పంపుతారు. మేం ఆ ప్రకారం తిట్టిపోస్తాం’ అని ఓ ఎంఎల్ఏ కూడా చెప్పారట. మరి మంత్రులు, ఎంఎల్ఏలు ఎవరితో ఎక్కడ అన్నారో చెప్పలేదు కాబట్టి వాళ్ళంతా వేమూరితోనే అన్నట్లు అందరూ అర్ధం చేసుకోవాలి.  

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చెత్తపలుకులో వచ్చిన అంశాలన్నిటింనీ ఎవరైనా సరే నాలుగు గోడలమధ్య కూర్చుని ఈజీగా అల్లేయచ్చు. ఎందుకంటే ఓ మంత్రి, ఇంకోమంత్రి, ఓ ఎంఎల్ఏ, ఓ ఐఏఎస్ అధికారి అని పేర్లు చెప్పకుండా రాయాలని అనుకుంటే ఎంత చెత్తైనా రాసేయచ్చు.  లేకపోతే జగన్ మంత్రివర్గంలో  రాధాకృష్ణ కోవర్టులన్నా ఉండుండాలి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: