ఏపీ రాజకీయాల్లో మాటల యుద్దాలు రోజు రోజుకు ఎక్కువవుతు ఉన్నాయనిపిస్తుంది. ఎప్పుడైతే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి ప్రతిపక్ష పార్టీ, అధికారపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.. రోజుకో మాటల యుద్దం నిర్విరామంగా తూటాల్లా పేలుతూనే ఉన్నాయి..

 

 

ఇక తాజాగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అటు చంద్రబాబుని, ఇటు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసినట్లు ఉన్నాడని అనుకుంటున్నారు ఇప్పుడు ఆయన మాటలు విన్న వారు.. ఇకపోతే ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...  చైనాను కరోనా వైరస్ పట్టి పీడిస్తున్నట్లుగా, ఏపీని చంద్రన్న కరెప్షన్ వైరస్ పట్టి పీడిస్తుందని అమరనాధ్ ఎద్దేవా చేసారు. ఇక అక్కడి నుండి మ్యాటర్‌ను జనసేనా అధినేత పవన్ వైపు మళ్లీస్తూ, ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు..

 

 

అదేమంటే గత సంవత్సరం  జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ గ్లాస్ బద్దలు అయిపోయిందని, ఇక రాజకీయ భవిష్యత్తును అయోమయంగా మార్చుకున్న పవన్ సినిమాలైనా చేసుకోవాలి.. లేదా మళ్లీ రాజకీయాలు అయినా చేసుకోవాలని సూచించారు. సినిమాలకు మధ్యలో రాజకీయాలు, రాజకీయాలకు మధ్యలో సినిమాలు చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు.

 

 

అంతటితో ఆగకుండా పవన్‌కు ఉన్నది మూడు.. లేనివి కూడా మూడేనని తాను ఎప్పుడో చెప్పానని  అన్నారు. అవేంటంటే పవన్‌కు సిద్ధాంతం, వ్యక్తిత్వం, స్థిరత్వం ఈ మూడు లేవని. ఆయనకు ఉన్న మూడు ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పరోక్షంగా పవన్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించారు అమరనాధ్..

 

 

ఏది ఏమైనా రోజు రోజుకు రాజకీయ విమర్శలు మానుకుని, వ్యక్తిగత విమర్శలకు దిగడం నిజంగా దురదృష్టకరమైన విషయమని ఇప్పటికే కొందరు సామాన్య ప్రజలు అనుకుంటున్నారట. రాజకీయం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, అబివృద్ధిని సాదించాలే గాని, అనారోగ్య కరమైన మాటలను చొప్పించకూడదని చర్చించు కుంటున్నారట.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: