చంద్రబాబునాయుడు తెలంగాణా నేతలెవరికీ అందుబాటులో లేరని సమాచారం. ఏపిలో అధికారం కోల్పోయిన దగ్గర నుండి ప్రతి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కు వచ్చేస్తున్నారు. శనివారం, ఆదివారం తెలంగాణా నేతలతో భేటి అవ్వటానికి కేటాయిస్తున్నట్లు చెప్పుకున్నారు. సరే కొన్నిసార్లు వచ్చారు ఇంకొన్ని సార్లు భేటిలు రద్దు చేసుకున్నారు లేండి అది వేరే సంగతి.

 

అయితే తాజాగా శుక్రవారం విజయవాడ నుండి హైదరాబాద్ కు చంద్రబాబు వచ్చారు. ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ కు శనివారం వస్తారని నేతలకు భవన్ నుండి సమాచారం కూడా అందింది. దాంతో చంద్రబాబును కలుద్దామని అనుకున్న నేతలు ఎన్టీయార్ భవన్ కు శనివారం చేరుకున్నారు. ఎంతసేపు వెయిట్ చేసినా చంద్రబాబు రానేలేదు. దాంతో చేసేది లేక వచ్చిన నేతలు వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు.

 

అయితే ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. అదేమిటంటే చంద్రబాబుకు అత్యం సన్నిహితులపై ఐటి దాడులు జరగటమే. దాదాపు పదేళ్ళు తన దగ్గర పనిచేసిన శ్రీనివాస్ పై ఐటి దాడులు జరిగింది. అలాగే లోకేష్ కు బాగా సన్నిహితుడైన కిలారు రాజేష్ తో పాటు మాజీ మంత్రి   ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులపై వరుసబెట్టి ఐటి దాడులు జరగటంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైంది.

 

ఎంతమంది ఐటి దాడులు జరిగినా పిఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ మీద, రాజేష్ వ్యవహారాలతో  నారా కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందట. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న కాలంలో శ్రీనివాస్ ఏ స్ధాయిలో చక్రం తిప్పింది అందరికీ తెలిసిందే. గడిచిన ఐదు రోజులుగా ఐటి సోదాలు కంటిన్యు అవుతుండటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే లోకేష్ కు బినామీగా ప్రచారంలో ఉన్న రాజేష్ పైన దాడులు జరగటం గమనార్హం.

 

ఈ నేపధ్యంలో తెలంగాణా నేతలతో భేటి అయితే తప్పకుండా ఐటి దాడుల వ్యవహారం చర్చకు వస్తుందనే ఆలోచనతోనే  చంద్రబాబు భేటిలన రద్దు చేసుకున్నట్లు సమాచారం. దాదాపు రెండు రోజులు హైదరాబాద్ లోనే ఉన్నా నేతలు ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉండిపోయాడట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: