పెండ్యాల శ్రీనివాస్ ఇంటిపై ఐటి ఉన్నతాధికారుల సోదాల్లో సంచలన విషయాలు బయటపడ్డాయా ?   చంద్రబాబునాయుడు దగ్గర పెండ్యాల ఐదేళ్ళ పాటు పిఎస్ గా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నంత కాలం శ్రీనివాస్ ఏ స్ధాయిలో అధికారాలు చెలాయించారో అందరికీ తెలిసిందే. ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబుకు శ్రీనివాసే కళ్ళు, చెవుల్లాగ పనిచేశాడు. దాంతోనే ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో మాజీ పిఎస్ పాత్రేమిటో ఎవరికి వాళ్ళే అంచనా వేసుకోవచ్చు.

 

అలాంటి మాజీ పిఎస్ ఇంటిపై ఐదు రోజుల క్రితం తెల్లవారుజామునే ఐటి రెయిడ్లు జరిగింది. అంటే ఇంకా ఇంట్లో సోదాలు జరుగుతునే ఉన్నాయి లేండి.  శ్రీనివాస్ ఇంట్లో ఓ రహస్య లాకర్ బయటపడిందని, అందులో కొన్ని డైరీలు, వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు బయటపడ్డాయనే  ప్రచారం అందరికీ తెలిసిందే. డైరీ బయటపడిందనే విషయం వెలుగు చూసిన దగ్గర నుండి చంద్రబాబునాయుడు, టిడిపి నేతల్లో టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతోంది.

 

బయటపడిన ఆ డైరీలో కొన్ని సంచలన వివరాలు ఐటి అధికారులకు దొరికినట్లు సమాచారం. అదేమిటంటే ఆమధ్య రాజస్ధాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘర్, హర్యానా రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు ఏపి నుండి చంద్రబాబే భారీ ఎత్తున నిధులు సర్దినట్లు ప్రచారం జరిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే.

 

అప్పట్లో సర్దుబాటు చేసిన డబ్బంతా పూర్తిగా హవాలా డబ్బే అనే ఆరోపణలు అప్పట్లోనే వినబడ్డాయి. పైగా కాంగ్రెస్ సాధించిన విజయాల్లో  తన పాత్ర ప్రముఖంగా ఉందని అప్పట్లో స్వయంగా చంద్రబాబే చెప్పుకున్నారు. అభ్యర్ధుల ఎంపికలో పాత్ర లేదు. ప్రచారానికీ వెళ్ళలేదు. అయినా కాంగ్రెస్ గెలుపులో  తన భాగస్వామ్యం ఉందని చంద్రబాబు చెప్పుకోవటమే అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే పార్టీకి భారీ ఎత్తున డబ్బు సర్దుబాటు చేశారనే ప్రచారం ఊపందుకుంది. ఇపుడు శ్రీనివాస్ ఇంట్లో దొరికన డైరీలో ఏ ఏ రాష్ట్రానికి ఎంతెంత డబ్బు సర్దుబాటు చేశారనే వివరాలున్నాయనే ప్రచారం మొదలైంది. నిజంగానే డైరీలో ఈ వివరాలుంటే సంచలనం మొదలైనట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: