పై ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న మహిళ పేరు మామిళ్ళపల్లి దీప్తి. కాకుమాను మండలం బోడుపాలేనికి చెందిన ఈమె నిరుద్యోగులను మోసగించి డబ్బులను కాజేయడంలో దిట్ట. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తనని తాను సిఎంవోలో ఒక ఉద్యోగినిగా చెప్పుకుంటూ తన నకిలీ ఐడి కార్డ్ ని అందరికీ చూపిస్తూ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపేది. సచివాలయంలో ఎల్లప్పుడు తిరుగుతూ బీభత్సమైన సందడి చేసేది. మంత్రుల శాఖ కార్యాలయాలలోకి తరచుగా వెళ్తూ వస్తూ... ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను నమ్మించేది.


గత సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన ఐదుగురు నిరుద్యోగులకు ఏపీ జెన్కో లో ఉద్యోగాలు ఇప్పిస్తానని వల్లభ రెడ్డి రామకృష్ణారెడ్డి తో ఒప్పందం పెట్టుకుంది. ఆ ఒప్పందం ప్రకారం.. అతడు ఆమెకు అక్షరాల రూ.12.50 లక్షలు ఇవ్వవలసి వచ్చింది. అంతేకాకుండా గుంటూరు జిల్లాకు చెందిన ప్రతిపాటి దిలీప్, మోహన్ రావులు కూడా ఉద్యోగం కోసం అని ఆమెకు రూ.6.50 లక్షలు చెబుతున్నారు.


కానీ ఆఖరి నిమిషంలో తాము మోసపోయామని తెలుసుకొని న్యాయం చేయాలంటూ గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్ ను బాధితులు ఆశ్రయించారు. దీంతో అక్టోబర్ 15వ తేదీన ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల అనగా ఫిబ్రవరి 4న టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ హాజరైన కార్యక్రమంలో ఈమె పాల్గొన్నది. ఇది తెలిసిన పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు యత్నించారు కానీ ఆమె తెలివిగా తప్పించుకుని పారి పోయింది. అలా పారిపోయిన ఆమెను హైదరాబాదులో పోలీసులు అరెస్టు చేసి పెదకాకాని కి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం ఆమెకు 11 రోజుల రిమాండ్ విధించింది. ఏదేమైనా అమాయకులను మోసం చేసి లక్షల రూపాయలను దోచుకొని లగ్జరీ లైఫ్ ని అనుభవించిన మామిళ్ళపల్లి దీప్తిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకొని ఈమె వల్ల మరొకరు మోసపోకుండా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: